చూస్తుండగానే.. కెరీర్‌ని సూపర్ ఫాస్ట్‌గా పరుగులు పెట్టించేస్తున్నాడు సాయిధరమ్ తేజ్.
రేయ్ ఫ్లాప్ అయినా… అతని కష్టం కనిపించింది. పిల్లా నువ్వు లేని జీవితంతో అతని టాలెంట్ బయటకు వచ్చింది. సుబ్రమణ్యం ఫర్ సేల్‌తో అతని రేంజ్ తోతెలిసింది. సుప్రిమ్తో స్టామినా అర్థమైంది. ఇప్పుడు తిక్క చూపించడానికి రెడీ అయ్యాడు సాయిదరమ్ తేజ్. సాయి కెరీర్లో ఎక్కువ బడ్జెట్ పెట్టింది ఈ సినిమాకే. శనివారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా తిక్క హీరో.. సాయిధరమ్‌తేజ్‌తో జరిపిన చిట్ చాట్ ఇది.
* హాయ్
– హాయండీ…
* ఇంకొద్ది గంటల్లో సినిమా రిలీజ్ అవ్వబోతోంది… టెన్షన్‌గా ఏమైనా ఫీలవుతున్నారా, లేదంటే కాన్ఫిడెన్స్‌గానే ఉన్నారా?
– నిజం చెప్పాలంటే ఈ సినిమాపై నాకు ముందు నుంచీ నమ్మకం. కచ్చితంగా మంచి సినిమా అవుతుంది. ఎంత కాన్ఫిడెన్స్‌గా ఉన్నా.. లోలోపల టెన్షన్ కూడా ఉంటుంది కదా.. అదీ ఉంది.
* తిక్క అనే టైటిల్ పెట్టడానికి కారణం..?
– సినిమా అలానే ఉంటుంది.. తిక్క తిక్కగా. నెగిటీవ్ టైటిల్ అనే ఫీలింగ్ వచ్చింది.. కానీ, ఈ సినిమాని ఇదే కరెక్ట్ టైటిల్. మా ఇంట్లో ‘తిక్క హీరో వచ్చాడు…’ అంటూ నన్ను ఆట పట్టిస్తున్నారు. అదొక్కటి తప్పిస్తే.. ఈ టైటిల్ గురించి అన్ని చోట్ల నుంచీ పాజిటీవ్ రెస్పాన్సే వచ్చింది.
* పోస్టర్లలో గ్లాసూ, మందు బాటిల్ పెట్టారు.. హ్యాండిల్ విత్ కేర్ అంటూ క్యాప్షన్ కూడా జోడించారు. ఏమిటి విషయం..?
– ఓ రాత్రి జరిగిన కథ ఇది. హ్యాంగోవర్లో.. హీరో ఏం చేశాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది. అందుకే అలాంటి క్యాప్షన్ పెట్టాం.
* సిగరెట్టు తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని చెబుతూనే హీరోలు ఇలా తాగేస్తుంటే ఎట్టా?? ఆడియన్స్‌కు రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి కదా?–
అవుననుకోండి. కాకపోతే… ఈ సినిమాలో మందు తాడగం వల్ల కలిగే నష్టాలు చెప్పాం. సో.. మా ఇంటెన్షన్ అనేది క్లియర్‌గా అర్థం అవుతుంది.
* ఇంతకీ తిక్క కథేంటి?
– బ్రేకప్ అయిపోయిన బాధలో ఓ కుర్రాడు తాగి ఏం చేశాడన్నదే ఈ సినిమా. ఒక రాత్రి జరిగే స్టోరీ ఇది. ఇప్పటి వరకూ ఇలాంటి జోనర్ నేను
ట్రై చేయలేదు.
* హాలీవుడ్ మూవీ హ్యాంగోవర్ ఛాయలేమైనా కనిపిస్తాయా?
– అలాంటిదేం లేదండీ. ఇది టోటల్‌గా కొత్త కథ.
* ఈ సినిమాకి బడ్జెట్ బాగా ఎక్కువైపోయిందని బటయ టాక్..
– అదేం లేదు. ఈ సినిమాకి, నా మార్కెట్‌కి ఎంత ఖర్చు పెట్టాలో అంతే పెట్టారు. సినిమా చాలా క్వాలిటీగా ఉంటుంది. క్వాలిటీ విషయంలో మేం రాజీ పడేదే లేదు… అని నిర్మాతలు ముందే చెప్పారు. అనుకొన్నట్టే చాలా బాగా తీశారు.
* ఈ చిత్ర దర్శకుడు సునీల్ మీ ఫ్రెండే కదా.. సెట్లో వాతావరణం ఎలా ఉండేది?
– చాలా బాగుండేదండీ. మా ఇద్దరికీ మంచి రాపో ఉంది. నేనేం చేయగలనో తనకు తెలుసు. నా కంఫర్ట్ నాకు ఇచ్చాడు.
* ధనుష్, శింబులతో పాట పాడించాలని ఎందుకు అనిపించింది?
-అది తమన్ ఆలోచన. ట్యూన్ చెప్పగానే వాళ్లు కూడా సంతోషంగా ఒప్పుకొన్నారు. అసలు సెకండ్ థాటే లేదు. ఆ పాటలు ఆడియోకి బలాన్నిచ్చాయి.
* కెరీర్ ఎలా సాగుతోంది? మీ కొస్తున్న అవకాశాల పట్ల హ్యాపీగానే ఉన్నారా?
– చాలా హ్యాపీగా ఉన్నా. ఆడియన్స్ నన్ను చాలా త్వరగా రిసీవ్ చేసుకొన్నారు. నామీద నమ్మకంతో థియేటర్లకు వస్తున్నారు. వాళ్లకు కావల్సిన వినోదాన్ని ఇవ్వడానికి నూటికి నూరుశాతం కష్టపడతా. కథ వింటున్నప్పుడు కేవలం ఓ ప్రేక్షకుడిలానే ఆలోచిస్తా. ప్రేక్షకులకు కావల్సినవన్నీ ఇందులో ఉన్నాయి అనుకొంటే… తప్పకుండా చేస్తా. కథల విషయంలో నా మీటర్ అదే.
* కృష్ణవంశీ సినిమాలో నటిస్తున్నారట..
– అవునండీ. ఒక విధంగా నా కల నిజమైనట్టే. ఎప్పటి నుంచో ఆయనతో పనిచయం ఉంది. ఆయన మేకింగ్ స్టైల్ అంటే నాకిష్టం. ‘నక్షత్రం సినిమాలో ఓ రోల్ చేయాలి..’ అని అడగ్గానే, నా పాత్రేమిటి? కథేమిటి? అని అడక్కుండానే ఓకే చేశా.
* కల్యాణ్ రామ్‌తో ఓ సినిమా చేస్తున్నార్ట…–
అవునండీ… ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి.
* మీ ఫ్యామిలీ హీరోలతో సినిమా ఎప్పుడు?
నాకైతే అందరితోనూ చేయాలని వుంది. కానీ కథ దొరకాలి. మంచి కథ దొరికితే ఏ హీరోతో అయినా కలసి నటించడానికి నేను రెడీ.
* సినిమాల విషయంలో నిర్ణయం ఎవరిది? ఇంట్లో ఎవరితోనైనా డిస్కర్స్ చేస్తారా?
– పూర్తిగా నా నిర్ణయమేనండి. కాకపోతే సినిమా బయటకు వచ్చాక.. ఇంట్లోవాళ్లు చీల్చి చెండాలతారు. మా అమ్మ, మా తమ్ముడు ది బెస్ట్ క్రిటిక్స్. నచ్చకపోతే నిర్దాక్ష్యణ్యంగా చెప్పేస్తారు.
* గోపీచంద్ మలినేనితో సినిమా ఎప్పుడు? టైటిల్ ఆకతాయి.. అంటున్నారు?
– ఈ నెలాఖరున సెట్స్‌పైకి వెళ్తుంది. టైటిల్ ఇంకా ఏమీ అనుకోలేదు.
* ఓకే.. ఆల్ ద బెస్ట్
థ్యాంక్యూ….
