ఇది సోషల్ మీడియా యుగం. అందుకు ప్రింట్ మీడియా వాళ్లు కొంచె జాగ్రత్తగా ఉంటే మంచిది. లేకపోతే ఇలాగే ఉంటుంది మరి! ప్రముఖ తెలుగు పత్రిక ఆంధ్రజ్యోతి ఇప్పుడు ఇలానే దొరికిపోయింది. ఆ పత్రిక ఫస్ట్ పేజీలో ఒక జిమ్మిక్ జరిగిందని అంటూ రేడియో జాకీ శేఖర్ భాషా పోస్టు చేసిన ఒక వీడియో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ షికారు చేస్తోంది. తన ఫేస్ బుక్ వాల్ పై ఆ రేడియో జాకీ జ్యోతి పత్రిక జిమ్మిక్ పై వీడియో ను పోస్టు చేశాడు.
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణలో పర్యటించిన నేపథ్యంలో మోడీ సభకు హాజరైన జన సందోహానికి సంబంధించి ఆ పత్రిక ప్రచురించిన ఫొటో ఒరిజినల్ కాదు అనేది ఆ రేడియోజాకీ వాదన. ఒక ఫొటోను తీసి.. దాన్నే కటింగ్ పేస్టింగ్ తో.. భారీ జన సందోహం హాజరైనట్టుగా చూపించే యత్నం చేశారని అతడు అంటాడు. ఇందుకు సంబంధించి ఆ పేపర్ ఫస్ట్ పేజీలో ప్రచురితమైన ఫొటోను చూపుతూ.. అది గ్రాఫిక్ అని రుజువు చేసే యత్నం చేస్తాడు శేఖర్ భాషా!
మరి మీడియా అంటే అందరికీ నీతులు చెబుతూ ఉంటుంది. మాయగాళ్ల అసలు రంగు ను బయట పెట్టడం మీడియా పని అనుకొంటారంతా. కానీ ఇలా మీడియానే మాయ చేస్తే అది కూడా ఇలా దొరికిపోతే అప్పుడు జనాలు మామూలుగా నవ్వరు! ఇప్పుడు రేడియో జాకీ వీడియో కూడా విపరీతంగా షేర్ అవుతోంది. అతడి ఫాలోయర్లు దాన్ని షేర్ చేస్తూ.. అనేక మందికి షేర్ చేస్తున్నారు! మరి ఇలాంటి విషయాలను గమనించి మీడియా సంస్థ లు మాయ చేయడాన్ని ఆపితే మేలేమో!
