కె.ఎస్.రవికుమార్… కమర్షియల్ సినిమాలు చేయడంలో దిట్ట ఈయన. రజనీ కాంత్కి సూపర్ హిట్లు ఇచ్చాడు. కమల్హాసన్తోనూ పనిచేశాడు. తెలుగులో చిరు, నాగ్ల చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఇప్పుడు మరోసారి చిరంజీవితో కలసి పనిచేయాలని ఉబలాటపడుతున్నాడు. ”చిరంజీవి గారితో స్నేహం కోసం సినిమా చేశా. ఆ సినిమా బాగానే ఆడింది. చిరంజీవి గారి నటన కు మంచి మార్కులు పడ్డాయి. అన్నీ కుదిరితే.. చిరుతో కలసి మళ్లీ పనిచేస్తా” అంటున్నాడీ సీనియర్ దర్శకుడు.
చిరంజీవి 60వ పుట్టిన రోజు వేడుకలు ఇటీవల హైదరాబాద్లోఘనంగా జరిగాయి. ఆ కార్యక్రమానికి రవికుమార్ కూడా హాజరయ్యాడు. ఆ సమయంలోనే ‘మనం కలసి ఓ సినిమా చేద్దాం’ అని చిరు చెప్పారట. దాంతో రవికుమార్ చిరుకి తగిన కథ కోసం అన్వేషణ మొదలెట్టారని టాక్. ప్రస్తుతం సుదీప్ హీరోగా కన్నడలో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారాయన. చిరంజీవి రీ ఎంట్రీ తరవాత ఆయనతో సినిమాలు చేయడానికి దర్శకుల క్యూ బాగా పెరుగుతోంది. 151వ చిత్రానికి పోటీ ఏర్పడింది. ఆ జాబితాలో ఈయన పేరూ చేయాలంటే.. సుదీప్ సినిమా సూపర్ హిట్ చేయాల్సిందే.
