గోపాల గోపాల తరవాత కొంత విరామం తీసుకొని వెంకటేష్ చేసిన సినిమా… బాబు బంగారం. భలే భలే మగాడివోయ్‌తో సూపర్ హిట్ కొట్టిన మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నయనతార కథానాయిక అవ్వడం, వెంకీ – నయనలకు ఇది హ్యాట్రిక్ చిత్రం కావడంతో ఈ సినిమాపై హైప్ పెరిగింది. ప్రచార చిత్రాల్లో వెంకటేష్ అయ్యో.. అయ్యో.. అయ్యయ్యో అంటూ బొబ్బిలిరాజా రోజుల్ని గుర్తుకు తీసుకొస్తుండడంతో వెంకీ అభిమానులు ఈ సినిమా గురించి ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. రేపే.. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి ల్యాబ్ రిపోర్ట్ ఎలా ఉంది?? ఈ సినిమా భవిష్యత్తు ఎలా ఉండబోతోంది??
ల్యాబ్ రిపోర్ట్ చూస్తుంటే ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర పాస్ అయిపోయేట్టే ఉంది. ఫస్టాఫ్ వెంకీ తన స్టైల్ ఆఫ్ కామెడీతో అదరగొట్టేశాడట. నయనతార ప్రేమ పొందేందుకు వెంకీ చేసిన ప్రయత్నాలు కామెడీ పంచుతాయని తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ నేపథ్యంలో సాగే సరదా సరదా సన్నివేశాలు ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ అంటున్నారు. ఒకట్రెండు పాటలు బాగా క్లిక్కయ్యాయట. మరీ ముఖ్యంగా బాబు బంగారం అంటూ సాగే టైటిల్ సాంగ్ బాగా వచ్చిందట. ఈ పాటే ఈ చిత్రానికి స్పెషలాఫ్ ఎట్రాక్షన్ అంటున్నారు. గబ్బర్ సింగ్లోలా.. ఇందులో ఓ కామెడీ ఎపిసోడ్ ఉందట. అది కూడా క్లిక్కయితే ఈ సినిమా రేంజ్ ఎక్కడో ఉంటుందని చెబుతున్నారు.
స్టోరీలో పెద్దగా బలం లేకపోయినప్పటికీ కామెడీతో బండి నడిపించేశాడట మారుతి. సెకండాఫ్ మాత్రం స్లో అయ్యిందట. ఫస్టాఫ్‌లో సరదాగా ఉండే వెంకీ పాత్ర సెకండాఫ్‌లో సీరియస్‌గా మారిపోవడంతో సినిమా బేస్ మారిపోయిందని చెబుతున్నారు. అయితే పోసాని, 30 ఇయర్స్ ఫృథ్వీ కలసి మళ్లీ ట్రాక్ ఎక్కించారని సమాచారం. క్లైమాక్స్ వీక్ అయ్యిందట. మొత్తానికి ఈ సినిమా కనీసం యావరేజ్‌గా అయినా నిలబడడం ఖాయంటున్నారు. సో.. వెంకీ బెంగ పడక్కర్లేదన్నమాట.
