చిత్రసీమలో గాసిప్పులు మామూలే. చాలాసార్లు ఇలాంటి గాసిప్పుల పట్ల తారాగణం లైట్ తీసుకొంటుంది. కొన్ని గాసిప్పులు మాత్రం వాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంటాయి. నిత్యమీనన్ చుట్టూ అలాంటి గాసిప్పే తిరుగుతోంది. నిత్యమీనన్ ప్రేమలో పడిందని, అదీ ఓ పెళ్లయిన వాడితో అన్నది ఆ గాసిప్ సారాంశం. అతనెవరో కాదు.. సల్మాన్ దుల్కర్. వీళ్లిద్దరూ కలసి ఓకే బంగారంలో నటించారు. ఆ సినిమా సూపర్ హిట్టయ్యింది. అది కాక మరో రెండు మలయాళ చిత్రాల్లో జోడీ కట్టారు. అప్పటి నుంచీ… ఇద్దరూ బయట కూడా అంతే ఇదిగా కలసి తిరుగుతున్నారని టాక్. దుల్కర్కి ఆల్రెడీ పెళ్లయిపోయింది. అయినా నిత్య వదలడం లేదట.
కొన్ని మలయాళ పత్రికలు, టీవీ ఛానళ్లు వీళ్లిద్దరి ప్రేమాయణంపై పుకార్లు మొదలెట్టాయి. వాటిపై నిత్య సీరియస్ అయ్యింది. దుల్కర్కి పెళ్లయ్యింది.. తన భార్యతో సంతోషంగా ఉన్నాడు.. ఈ విషయాన్ని గాసిప్ రాయుళ్లు గుర్తుంచుకొంటే మంచిది అంటూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. అయితే ఇలాంటి గాసిప్పులను తాను పట్టించుకోనని చెప్పింది. కానీ… మసాలా వార్తల కోసం కాపురాలు పాడుచేయొద్దంటూ కోరుకొంటోంది నిత్య. అయితే.. నిత్య, దుల్కర్లపై మాత్రం వార్తలు పుడుతూనే ఉన్నాయి. తాజాగా వీళ్లిద్దరూ ఓ రెస్టారెంట్లోకబుర్లు చెప్పుకొంటూ కనిపించార్ట. ”ఇద్దరూ కలసి సినిమాలేం చేయడం లేదు కదా? అయినా ఏమిటీ బంధం..” అంటూ బుగ్గలు నొక్కుకొంటున్నారంతా.
