గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా నుంచి దేవిశ్రీ ప్రసాద్ బయటకు వచ్చేయడం నందమూరి అభిమానులకు, సినీ పరిశ్రమకు షాక్ ఇచ్చే విషయమే. అయితే ఈ ట్విస్ట్ బాలయ్య, క్రిష్‌లు ముందే ఊహించార్ట. ఎందుకంటే ఈ సినిమాకు పనిచేయడం దేవికి ముందు నుంచీ ఇష్టం లేదట. కేవలం బాలయ్య బలవంతంపై.. ఈ సినిమాలో పనిచేయడానికి దేవి ఒప్పుకొన్నాడట. అయితే మధ్యలో చాలాసార్లు.. ”నాకు కుదరదేమో, మీరు మరో ఆప్షన్నిచూసుకోవడం మంచిదేమో” అంటూ హింట్లు ఇచ్చుకొంటూ వచ్చాడట. చివరికి అదే నిజమైంది. ”రషెష్ చూద్దురు గానీ రండి” అని కబురంపితే… చావు కబురు చల్లగా చెప్పాడు దేవిశ్రీ.
”సమయం చాలడం లేదు” అన్నది దేవిశ్రీ ప్రసాద్ మాట. అయితే.. వరుసగా సినిమాల్ని ఎందుకు ఒప్పుకొన్నాడు. తాజాగా నాని సినిమా ‘నేను లోకల్’కి సంతకం చేశాడు దేవిశ్రీ ప్రసాద్. బాలయ్య సినిమా కంటే నాని సినిమా ఎందుకు ఎక్కువ అవుతుంది? కేవలం ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడానికి దేవిశ్రీ ప్రసాద్ కుంటి సాకులు వెదికాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగతి ముందే తెలుసుకొన్న క్రిష్.. మరొకర్ని వెంటనే లైన్లోకి తీసుకొచ్చేశాడని టాక్. `కంచె` సినిమాకి అద్భుతమైన నేపథ్య సంగీతం అందించిన బాలీవుడ్ స్వరకర్త.. చిరంతన్ భట్ని ఈ సినిమాకోసం ఎంచుకొన్నారని తెలుస్తోంది.
