సినిమాల్లో విలన్ రోల్ ఎంత బలంగా ఉంటే హీరో పాత్రకు అంత ఎలివేషన్ వస్తుంది. రాజకీయాల్లోనూ అంతే సరైన ప్రత్యర్థి ఉన్నప్పుడే అధికారపార్టీ పాత్ర ఎలివేట్ అవుతుంది. కానీ ఏపీ రాజకీయాల్లో అలాంటిది లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీకి నిద్ర పట్టేది కాదు. ఆ పార్టీ కార్యకలాపాలను నిలిపివేయడానికి ఎవర్ని అరెస్టు చేయాలా.. ఎవర్ని వేధించాలా అని కుట్రలు చేయడానికే సమయం అంతా కేటాయించేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా పోయింది. వైసీపీ పూర్తిగా చేతులెత్తేసింది. ఫలితంగా టీడీపీకీ సమస్యలు వస్తున్నాయి.
ప్రత్యర్థి లేకపోవడంతో ఎమ్మెల్యేల ఇష్టారాజ్యం
వైసీపీ నేతలు ఇప్పుడు ఎవరూ యాక్టివ్గా లేరు. ఉన్న వారంతా మీడియాలోనే ఉన్నారు. అంబటి రాంబాబు అయినా మరొకరు అయినా మీడియా కనిపించి చేస్తున్నదే రాజకీయం. నియోజకవర్గాల్లో చేస్తున్నదేమీ లేదు. కుదిరితే టీడీపీ నేతలతో రాజీ చేసుకుని ఎంతో కొంత లబ్దిపొందాలని ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది ఆ ఒప్పందాలు పూర్తి చేసుకుని సైలెంటుగా గా ఉన్నారు. మిగిలినవాళ్లు అసలు నియోజకవర్గాల్లో కనిపించడంలేదు. ఇక హైకమాండ్ అయితే బెంగళూరుకే పరిమితం . అసెంబ్లీకే రావడం లేదు. అందుకే టీడీపీ ఎమ్మెల్యేలు ఆడిందే ఆట..పాడిందే పాటగా మారింది.
మితిమీరిన స్వేచ్ఛతో రెచ్చిపోతున్న ఎమ్మెల్యేలు
వైసీపీ నిర్వీర్యంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చెలరేగిపోతున్నారు. చివరికి వారుతో వ్యక్తిగత అంశాలను కూడా అసెంబ్లీలో పెట్టి చర్చిస్తున్నారు. బదిలీలు.. ఇతర అంశాలపైనా మాట్లాడుతున్నారు. కూన రవికుమార్ కూడా.. నారాయణ మంత్రిగా సరిగ్గా పని చేయడం లేదని అసెంబ్లీలోనే ఉన్నారు. ఇక బాలకృష్ణ, కామినేని వివాదం గురించి చెప్పాల్సిన పని లేదు. ప్రతిపక్షం ఉంటుంది అలర్ట్ నెస్ అవసరం లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. రాను రాను ఇవి పెరిగిపోతూండటమే ప్రమాదకరం.
తనను తాను కాపాడుకోవడానికే జగన్ ప్రాధాన్యం
తనకు నలభై శాతం ఓటు బ్యాంక్ ఉందని అంటున్న జగన్.. ఏడాదిన్నర దగ్గర పడుతున్నా ప్రజల్లోకి వచ్చే ఆలోచనలు చేయడం లేదు. ఇక నేరుగా పాదయాత్ర ద్వారానే ప్రజల్లోకి వస్తానంటున్నారు. అంటే మరో ఏడాదిన్నర పాటు బెంగళూరులో రెస్ట్ తీసుకుని ఎన్నికల కోసం పాదయాత్ర చేస్తారు. దీని వల్ల ఆ పార్టీకి ఏమైనా మేలు జరుగుతుందో లేదో కానీ.. ఇప్పటికి ఆయన పార్టీ నిర్వీర్యం అయిపోయింది. ఆ ప్రభావం టీడీపీ మీద కనిపిస్తోంది. ఇప్పుడు ఏపీకి ఓ బలమైన ప్రతిపక్షం అవసరం అని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి.
