వివేకాను హత్య చేసిన తర్వాత అక్కడి సీఐ ద్వారా రక్తపు మరకలు తుడిపించారని .. అసెంబ్లీలో చంద్రబాబు అన్నారు. ఆయన అనడం కాదు. సీబీఐ చార్జిషీట్లోనూ ఉంది. జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆ సీఐ పోస్టింగులు పొందారు. ఇప్పుడు వీఆర్ లో ఉన్నారు. ఆయన మళ్లీ జగన్ రెడ్డి గ్యాంగ్ చెప్పినట్లుగా చేస్తే మాధవ్ ను పంపినట్లుగా అసెంబ్లీకో.. పార్లమెంట్ కో పంపుతారని ఆశపడుతున్నారేమో కానీ.. తన పేరుతో లీగల్ నోటీసులు పంపడానికి వైసీపీ లాయర్లకు చాన్స్ ఇచ్చేశారు.
వివేకాను హత్య చేసినప్పుడు పులివెందుల సీఐగాఉన్న శంకరయ్య సాక్ష్యాల తుడిచివేతపై సీబీఐకి మొదట వాంగ్మూలం ఇచ్చారు. అప్పుడు ప్రభుత్వంలో ఉన్న జగన్ రెడ్డి తరపున ఆయనకు ఆఫర్ వెళ్లింది. వాంగ్మలాన్ని రివర్స్ చేసుకుంటే బోలెడన్ని ప్రయోజనాలు అని ఆ ఆఫర్ సారాంశం. అధికారంలో ఉన్నవారు అడిగితే కాదంటారా.. ఆయన అలాగే రివర్స్ చేశారు. వారానికే ఆయనకు పోస్టింగ్ వచ్చింది. ఇదంతా సీబీఐ చార్జిషీట్లో చెప్పిన నిజం. వైసీపీ ఉన్నంత కాలం ఆయనకు తిరుగులేదు. ఇప్పుడు కర్నూలు రేంజ్ లో వీఆర్ లో ఉన్నారు.
ఇక ఉద్యోగం ఉంటుందన్న గ్యారంటీ లేదు .. అందుకే సీఎంకే నోటీసులు ఇస్తే సంచలనం అని.. చెప్పి ఆయనను ట్రాప్ లోకి లాగేశారు. ఆయన పేరుతో ధరణేశ్వరరెడ్డి అనే లాయర్ చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపారు. ఇదంతా సంచలనం కోసం.. కేవలం సాక్షి పత్రికలో రాయడానికే. చంద్రబాబు చెప్పింది అసెంబ్లీలో. సీబీఐ రిపోర్టులో ఉన్నదే. అయినా ఆయన లీగల్ నోటీసుల పేరుతో హడావుడి చేయాలనుకుంటున్నారంటే.. ఆ శంకరయ్య భవిష్యత్ ను అంధకారం చేయడానికే. ఇప్పుడు ఆ సీఐపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో లేదో కానీ… ఆయన ఇక సర్వీసులో కొనసాగడం అసాధ్యం. రిటైర్మెంట్ కు దగ్గరపడ్డారేమో.. వైసీపీలో ఉపాధి దొరుకుతుందని ఆశపడి ఉండవచ్చు కానీ.. జగన్ రెడ్డి ఇలాంటి కుట్రలు చేసి .. శంకరయ్య లాంటి వాళ్లను బలి చేసి..తాను సైలెంట్ అయిపోతాడు.
వివేకా హత్య కేసులో హంతకులు ఎంత ఘోరమైన టాక్టిక్స్ ప్లే చేస్తారో ఇంత కంటే పెద్ద సాక్ష్యం ఉండదు. వీరు అత్యంత కరుడు గట్టిన నేరస్తులు. వీళ్లని ఉపేక్షిస్తే.. అంతకు పది హత్యలు చేసి.. ఎదురుదాడికి దిగుతారు.
