విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అన్న సెంటిమెంట్ తో విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తోంది. పూర్తిగా ప్రైవేటీకరణకు ఏర్పాట్లు చేసుకున్న కేంద్రాన్ని ఒప్పించి.. పధ్నాలుగువేల కోట్ల వరకూ సాయాన్ని అందించేలా చూసుకుంది. నిజానికి ఆ స్టీల్ ప్లాంట్ లో ఏపీ ప్రభుత్వానికి ఒక్క శాతం వాటా కూడా లేదు పూర్తిగా.. ఏపీ గడ్డపై ఉంది కాబట్టే .. సెంటిమెంట్ కాబట్టే చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి చేసి ప్లాంట్ ను కాపాడే ప్రయత్నం చేసారు. కానీ ఎలా ఎన్ని వేల కోట్లు తెచ్చి పోస్తే ఆ సంస్థ గట్టెక్కుతుందో ఎవరికీ తెలియడం లేదు. పోసినదంతా బ్లాస్ట్ ఫర్నేస్ లో పడి బూడిదగా మారితే ఎంత కాలం ప్రజల పన్నుల సొమ్ము తెచ్చి పోస్తారు?
సగానికిపైగా ఒడిషా ఉద్యోగులు – ఎవరూ పని చేయరు !
నిజం చెబితే నిష్ఠూరంగా ఉంటుంది. చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పని చేయడం లేదని అన్నారని ఆయనపై సాక్షి మీడియా కెమెరాల ముందు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. యూనియన్ నేతల పేరుతో చెలామణి అయ్యే వీరిలో ఒక్కరంటే ఒక్కరు కూడా విధుల్లోకి వెళ్లరు. కానీ ఠంచన్ గా జీతాలు తీసుకుంటారు. ఇతర దందాలు చేస్తారు. స్టీల్ ప్లాంట్ లో ఉండే ఉద్యోగుల్లో సగానికిపైగా ఒడిషా వారే ఉంటారు. పర్మినెంట్ ఉద్యోగుల్లో 90 శాతం మంతి పని చేయరు. తమ ప్లేస్ లో కాంట్రాక్ట్ ఉద్యోగులతో చేయించి తాము రిలాక్స్ అవుతారనేది.. ఎక్కువ మంది చెప్పే మాట.
ఉత్పత్తికి తగ్గ జీతాలు అంటే గగ్గోలు ఎందుకు ?
స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఉత్పత్తి లక్ష్యాలతో ముడిపెట్టి జీతాలు ఇస్తామని చెప్పింది. అంతే పెద్ద ఎత్తున ఉద్యోగులు ఉద్యమిస్తామని చెబుతున్నారు. నిజానికి ఉత్పత్తి లేకుండా ఆదాయాలు లేకుండా.. వారికి జీతాలు ఎక్కడి నుంచి తీసుకు వస్తారన్నది మాత్రం చెప్పరు. అంటే.. ప్లాంట్ పని చేసినా చేయకపోయినా లాభాలు రాకపోయినా తమ జీతాలు తమకు రావాలని..దానికి.. స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకుంటున్నారన్నమాట.
ప్రైవేటులో ఉన్నా ప్లాంట్ విశాఖలోనే ఉంటుంది – ఉద్యోగులనూ తీసేయరు !
ఇప్పటి వరకూ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు. వేల కోట్లు తెచ్చి పోస్తోంది కూడా.కానీ పరిస్థితి ఇలాగే ఉంటే మాత్రం సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారు. ప్రజలు కూడా అలా వేల కోట్లు పోసి ఆ సంస్థను నిలబెట్టలేరని రియలైజ్ అవుతారు. ప్రైవేటుకు ఇస్తే వారే లాభాల్లోకి తీసుకు వస్తారు. ఎందుకంటే.. విశాఖ ప్లాంట్ కు ఉన్న మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, బ్రాండ్ తో లాభాలు తేవడం పెద్ద విషయం కాదు. అప్పుడు కూడా ప్లాంట్ ఎక్కడికీ పోదు. అక్కడే ఉంటుంది. ఉద్యోగులకు ప్రైవేటులో ఇంకా జీతాలు పెంచుతారు. కానీ పని చేయించుకుంటారు. పని చేయకపోతే ఇంటికి పంపేస్తారు. అలా చేయడం వల్ల స్టీల్ ప్లాంట్ కాపాడుకోవచ్చు. లేకపోతే .. మూసేయడమే మార్గంగా మారినా ఆశ్చర్యం ఉండదు.ఆలోచించాల్సింది ఉద్యోగులే.
