పండుగ అంటే పండుగ. ఆ పండుగను సెలబ్రేట్ చేసుకోవడంలో హుషారు ఉంటే అంత కంటే కావాల్సింది ఏముంటుంది…?. ఇప్పుడు విజయవాడ ప్రజలకు దసరా ఉత్సవాలు కొత్త హుషారును అందిస్తున్నాయి. దసరా వేడుకలకు పెట్టింది పేరు అయిన విజయవాడలో గత కొన్నాళ్లుగా ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు జరగడం లేదు. అమ్మవారి దర్శనం .. దర్శనానికి ప్రజల ఇక్కట్లు అన్నట్లుగా మాత్రమే ఉండేవి. కానీ ఈ సారి మాత్రం విజయవాడకు పండుగ కళ తీసుకు రావాలని ప్రజా ప్రతినిధులు సొసైటీలాగా ఏర్పడి ప్రయత్నం చేశారు. ఇది మంచి ఫలితాలను ఇస్తోంది.
విజయవాడ ఉత్సవ్‌ను.. ప్రజలందరికీ మంచి పండుగ సంబరాలను ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. అన్ని రకాల కళా ప్రదర్శనలతో పాటు దసరా వేషాలు.. ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ తరహాలో ప్రజలకు వినోదం పంచనున్నారు. సాధారణంగా మనం ఊళ్లలో తిరునాళ్లు నిర్వహించుకుంటూ ఉంటాం. దాన్ని మరింత పెద్ద స్థాయిలో విజయవాడలో ఏర్పాటు చేశారని అనుకోవచ్చు. ఇలాంటి తిరునాళ్లలో భాగం కావడం అంటే.. పిల్లలకే కాదు పెద్దలకు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. చిన్న చిన్న ఆనందాలను ఇలాంటి ఉత్సవాలు తెచ్చి పెడతాయి.
వైఎస్ఆర్సీపీ హయాంలో హిందూ పండుగలకు ఓ నీరసమైన వాతావరణం కనిపించేది. సంక్రాంతిని కూడా చివరికి క్యాసినోలకు ఉపయోగించుకున్నారు. అధ్యాత్మికత, సాంస్కృతిక వేడుకలను నిర్వహించాలన్న ఆలోచన ఎప్పుడూ చేయలేదు. విజయవాడ దసరా ఉత్సవాలకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చేందుకు ఇప్పుడు .. విజయవాడ ఉత్సవ్‌కు ప్రత్యేకమైన ప్రయత్నం చేయడం మాత్రం ప్రజల్ని ఆకట్టుకుంటోంది.
ఇప్పుడు విజయవాడ కళ కళా లాడుతోంది. విద్యుత్ వెలుగు జిలుగులతో హుషారు కనిపిస్తోంది. గతంలో ఇబ్రహీంపట్నం వద్ద రోజూ.. కృష్ణాహారతి ఇచ్చేవాళ్లు. జగన్ సీఎం అయ్యాక ఆపేశారు. అప్పట్లో.. రోజూ సాయంత్రం అలాంటి హారతి ఇచ్చేటప్పుడు ప్రజలకు ఓ మంచి ఫీల్ లభించేది. తర్వాత అంతా నీరసంగా మారింది. ఇప్పుడు మళ్లీ పాత వైబ్ కనిపిస్తోంది. కొంత మంది ప్రజల సంతోషాలను అడ్డుకునే ప్రయత్నం చేసినా.. విజయవాడ ఉత్సవం.. నిర్విఘ్నంగా సాగనుంది.
