విదేశాలకు వెళ్లి అక్కడ చదువుకోవడం ఖర్చుతో కూడుకున్న పని. కానీ అవే యూనివర్శిటీలు మన దగ్గరకు వస్తే ఖర్చు మిగులుతుంది.. అక్కడి విద్యతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందవచ్చు. ఈ క్రమంలో అమరావతిలో విదేశీ యూనివర్శిటీలను ఏర్పాటు చేసే లక్ష్యంతో ఏపీ ప్రబుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయి. యూనివర్శిటీ ఆఫ్ టోక్యో తమ క్యాంపస్ ను అమరావతిలో పెట్టేందుకు సిద్ధపడింది. దీనికి సంబంధించి ఆ యూనివర్శిటీ ప్రతినిధులు అమరావతిని సందర్శించారు.
ప్రపంచంలోనే అత్యుత్తమం జపాన్ విద్యా వ్యవస్థ
జపాన్ విద్యా విధానం ప్రపంచంలోనే అత్యుత్తమైనదిగా చెబుతారు. అక్కడి యూనివర్శిటీ ఆఫ్ టోక్యో ఆసియాలోనే అత్యుత్తమ విద్యా సంస్థలలో ఒకటి. 1877లో స్థాపించిన ఈ విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా 20వ ర్యాంక్‌లో ఉంది. జపాన్‌లో ఎక్కువ మంది విద్యార్థులు చేరాలనుకునే వర్శిటీ. జపాన్ ఆధునీకరణలో ఈ యూనివర్శిటీజి కీలక పాత్ర. భవిష్యత్ ఆవిష్కరణల కోసం ఎక్కువగా పరిశోధనలకు ఈ యూనిర్శిటీ ప్రాధాన్యమిస్తుంది.
ప్రపంచంలోనే అత్యుత్తమ యూనివర్శిటీల్లో ఒకటి
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో యూనివర్శిటీ ఆఫ్ టోక్యో అత్యుత్తమ స్థానాల్లో ఉంది. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025 ప్రకారం అది ప్రపంచవ్యాప్తంగా 20వ స్థానంలో , ఆసియాలో 5వ స్థానంలో ఉంది. ఆసియాలో టాప్ 10లో ఉంది. యూనివర్శిటీ ఆఫ్ టోక్యో పూర్వ విద్యార్థులు 18 నోబెల్ బహుమతులు గెల్చుకున్నారు. ఈ యూనివర్శిటీలో చదువుకున్న వారు 21 మంది ప్రధాన మంత్రులు అయ్యారు. జపాన్‌లో అత్యధిక పేటెంట్లు ఫైల్ చేసే విశ్వవిద్యాలయం కూడా.
భవిష్యత్ టాలెంట్ కోసం అమరాతిపై దృష్టి
ఇండియాలో ముఖ్యంగా అమరావతిలో క్యాంపస్ పెట్టాలని యూనివర్శిటీ ఆఫ్ టోక్యో నిర్ణయించడం విద్యా రంగానికి ఎంతో మేలు చేస్తుంది. దేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఈ యూనివర్శిటీలో చదువుకునేందుకు పోటీ పడే అవకాశం ఉంది. ప్రపంచ స్థాయి యూనివర్శిటీలకు కేంద్రంగా అమరావతిని మార్చేందుకు.. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఇప్పటికే ఎస్ఆర్ఎం, విట్, అమృత వంటి వర్శిటీలు ఉన్నత ప్రమాణాలను అందుకున్నాయి.
