తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిని కల్తీ చేసిన కేసులో గుమ్మడికాయ దొంగ అంటే భూజాలు తడుముకున్న చందంగా మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయన బ్యాంక్ అకౌంట్లు, లావాదేవీల వివరాలు కావాలని నోటీసులు ఇస్తే కోర్టుకెళ్లారు. ఈ కేసులో ఆయన కోర్టుకెళ్లడం ఇదే మొదటి సారి కాదు. ప్రతీ దానికి కోర్టుకెళ్తున్నారు. విచారణ ఆలస్యమయిందంటే ఆయనే కారణం. ఇదంతా చూస్తూంటే మొత్తం శ్రీవారి ప్రసాదాన్ని కలుషితం చేసింది సుబ్బారెడ్డి ఆధ్వర్యంలోనేని స్పష్టంగా ఎవరికైనా అర్థమవుతుంది.
బ్యాంక్ అకౌంట్ వివరాలడిగితే కోర్టుకెళ్లిన సుబ్బారెడ్డి
సుబ్బారెడ్డి దగ్గర పీఏగా చేసిన అప్పన్న అనే వ్యక్తిని అరెస్టు చేసిన సీబీఐ సిట్ చాలా వివరాలు తెలుసుకుంది. అందులో అప్పన్నకు అంత సీన్ లేదని.. మొత్తం ఆయన పేరు మీద సుబ్బారెడ్డి నడిపారని కూడా తెలుసుంది. అప్పన్న పేరు మీద ఉన్న ఆస్తులు కూడా సుబ్బారెడ్డివేనని అనుమానిస్తున్నారు. అయితే సీబీఐ సిట్ చాలా పద్దతిగా అన్నీ బయట పెట్టాలనుకుని నోటీసులు జారీ చేస్తోంది. కానీ జారీ చేసిన ప్రతి నోటీసుపై కోర్టుకెళ్తున్నారు సుబ్బారెడ్డి. బ్యాంక్ డీటైల్స్ ఇవ్వమంటే కోర్టుకెళ్లారు. సిట్ ఈ పిటిషన్ కు కౌంటర్ వేసింది. సుబ్బారెడ్డి మీద చాలా అనుమానాలున్నాయని .. దర్యాప్తును కొలిక్కి తేవడానికే అడుగుతున్నామని స్పష్టం చేసింది.
దర్యాప్తు ఆలస్యం చేయడానికి ఎన్ని పిటిషన్లు వేస్తారు?
మొదట.. సీబీఐ సిట్ అధికారులు నోటీసులు జారీ చేయలేదని వేరే దర్యాప్తు అధికారి నోటీసులు ఇచ్చారని హైకోర్టుకెళ్లారు. హైకోర్టు అలా నోటీసులు జారీ చేయకూడదని చెప్పింది. అదేం ఆదేశాలని సుప్రీంకోర్టు వాటిని కొట్టి వేసింది. కానీ ఈ పక్రియ జరిగే వరకూ విచారణ ఆలస్యం అయింది. ఇప్పుడు మళ్లీ పిటిషన్లు వేశారు సుబ్బారెడ్డి. ఇంతగా ఆయన భుజాలు ఎందుకు తడుముకుంటున్నారో కాస్త ఆలోచన ఉన్న వారికి అర్థమవుతుంది. సీబీఐ సిట్ అధికారులు త్వరలో సంచలనాత్మక విషయాలను బయట పెట్టే అవకాశాలు ఉన్నాయి.
దేవుడితో పెట్టుకుని ఎలా బయటపడతామనుకుంటున్నారు?
దేవుడి సన్నిధిలో నాలుగేళ్ల పాటు ఉండి.. నెయ్యి కల్తీ సహా మొత్తం శ్రీవారి సేవలను దుర్వినియోగం చేశారు. టిక్కెట్ల దగ్గరనుంచి ప్రతీ దాంట్లోనూ దోచుకున్నారు. ప్రసాదాన్నే అపవిత్రం చేశారంటే.. ఇక వారి దోపిడీ గురించి చెప్పాల్సిన పని ఉండదు. దేవుడిపై నమ్మకం లేని వారే అలా చేస్తారు. సుబ్బారెడ్డి కుటుంబం క్రైస్తవాన్ని నమ్ముతుందని చాలా మంది చెబుతారు. అందుకే ఆయనకు నమ్మకంలేదేమో కానీ.. దేవుడ్ని చేశారు. కానీ ఇలా దోచేసి దొరికిపోకుండా ఉంటానని అనుకున్నారేమో కానీ.. పాపం పండే రోజు దగ్గరకు వచ్చేసిందని దర్యాప్తు వెల్లడిస్తోంది.
