తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ హైదరాబాద్‌లోని ఓస్మాన్ నగర్లో 100 అడుగుల రోడ్డుకు ఆనుకుని ఉన్న 26 ఎకరాల ప్రైమ్ ల్యాండ్‌ను వేలం వేయడానికి ఏర్పాట్లు చేసింది. బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు తమ ప్రాజెక్టుల్ని కట్టుకునేలా భారీ ప్లాట్లుగానే వేలం వేయనున్నారు. రాయదుర్గంలో ఉన్న మరో 40 ఎకరా భూమిని కూడా వేలం వేయనున్నారు.
రాయదుర్గంలోని 15ఏ/2 ప్లాట్‌కి అత్యధికంగా 71.60 కోట్ల రూపాయల మార్కెట్ ధర ఖరారు చేశారు. ఇక్కడ మొత్తం 7. 67 ఎకరాలను వేలం వేయనున్నారు. దీంతోపాటు ఇదే రాయదుర్గంలోని ప్లాట్ 19 .. మార్కెట్ ధర రూ. 66.30 కోట్లుగా ఉంది. 14ఏ/1, 14బీ/1, ప్లాట్ల మార్కెట్ ధరను.. చదరపు గజానికి రూ.2,16,405 గా ప్రకటించారు. అంటే ఈ రెండు చోట్ల ఎకరం భూమి ధర గరిష్టంగా రూ.105 కోట్లుగా నిర్ణయించారు. ఈ వేలంలో రాయదుర్గంలో 19. 67 ఎకరాలను విక్రయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ఉస్మాన్ సాగర్ లో ప్రస్తుతం ప్రభుత్వ విలువ అక్కడ ఎకరానికి రూ. 25 కోట్లు ఉంది. 100 అడుగుల రోడ్డుకు ఆనుకుని ఉన్న భూమి ఓపెన్ మార్కెట్లో ఎకరానికి 50 కోట్ల వరకూ ఉంటుంది. ఓస్మాన్ నగర్, తెల్లాపూర్ ప్రాంతాల్లో గృహ నిర్మాణ డిమాండ్ భారీగా ఉంది. ప్రైమ్ రోడ్-ఫేసింగ్ భూమి అరుదుగా అందుబాటులో ఉంటుంది. అందుకే ఈ ల్యాండ్ వేలంలో వంద కోట్లు దాటినా ఆశ్చర్యం లేదని రియల్ ఎస్టేట్ వర్గాలంటున్నాయి. రాజపుష్ప, మైహోమ్, అపర్ణ వంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇప్పటికే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు చేపడుతున్నాయి. ఈ సంస్థలు ఈ భూమిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉంది. 100 అడుగుల రోడ్డు, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (FSI) ఈ భూమిని హై-రైజ్ భవనాలకు అనువైనదిగా రియల్ ఎస్టేట్ కంపెనీలు భావిస్తున్నాయి.
ఈ వేలం కోసం ట్రాన్సాక్షన్ అడ్వైజరీ కన్సల్టెంట్‌ను నియమించేందుకు బిడ్లు ఆహ్వానించారు. కోకాపేట ల్యాండ్ లాగే పాటు ఓస్మాన్ సాగర్ , రాయదుర్గం భూములు ఎకరా వంద కోట్లకు చేరుతుందని అంచనా. TGIIC అధికారిక వెబ్సైట్ , auction.telangana.gov.in లలో మరిన్ని వివరాలు ఉన్నాయి.
