చెక్ బౌన్స్ కేసులో రామ్ గోపాల్ వర్మ జైలుకెళ్లకుండా..డబ్బులిచ్చి సెట్ చేసుకున్నారు. రామ్ గోపాల్ వర్మ కు ముంబైలోని అంథేరీ కోర్టు జనవరిలో మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఎన్ని సార్లు నాన్ బెయిలబుల్ వారెంట్స్ జారీ చేసినా ఆయనకోర్టుకు హాజరు కాలేదు. 2022లో ఓ సారి ఇలాగే ఆయనపై వారెంట్ జారీ అయితే కోర్టుకు హాజరై ఐదు వేల రూపాయలు పూచికత్తు ఇచ్చి బెయిల్ తెచ్చుకున్నారు. మళ్లీ కోర్టుకు హాజరు కావడం మానేశారు. చివరికి జనవరిలో కోర్టు విచారణ పూర్తి చేసి ఆయనకు మూడు నెలల జైలు శిక్ష విధించింది.
చెక్ బౌన్స్ కేసులో మొత్తం చెల్లించాల్సింది రూ. 3 లక్షల 72 వేల రూపాయలు మాత్రమే. ఇంత చిన్న మొత్తాన్ని కూడా ఆర్జీవీ చెల్లించలేదు. అందులోనూ 2022లో పూచికత్తు సమర్పించి బెయిల్ తెచ్చుకున్నారు కానీ సెటిల్ చేసుకోలేదు. అది వెంటాడింది. అయితే అది తాను తీసుకున్న అప్పు కాదని ఇతరులు చెల్లించాల్సింది తనపై పడిందని ఆయన వాదించారు. ఏదైనా తప్పు ఆయనది .. చెక్ ఆయనది కాబట్టి చెల్లించాల్సి న పరిస్థితి ఏర్పడింది. చెల్లించకపోతే జైలుకెళ్లాలి.
అందుకే ఆ కేసు వేసిన వాడ్ని బతిమాలుకుని లోక్ అదాలత్తో పరిష్కరించుకుంటామని .. తీర్పును పక్కన పెట్టాలని కోర్టుకెళ్లారు. చివరికి ఆ కోర్టు.. లోక్ అదాలత్ లో పరిష్కారానికి అంగీకిరంచింది. అక్కడ మూడు కు బదులు ముఫ్పై లక్షలు ఇచ్చి అయినా వర్మ జైలు శిక్ష నుంచి తప్పించుకోవాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడింది. ముందుగా ఎంత ఇస్తామో మాట్లాడుకుని కోర్టుకెళ్లి ఉంటారు.
ఏపీ ప్రభుత్వంలోనూ ఆయన ఓ స్కాం చేశారు. జగన్ రెడ్డి కోసం తీసిన రెండు సినిమాలను ఏపీ ఫైబర్ నెట్ లో రిలీజ్ చేసి కోటిన్నర కొట్టేశారు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని లేకపోతే కేసులు పెడతామని ఫైబర్ నెట్ నోటీసులు జారీ చేసింది. ఆ కేసుపైనా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
