సంక్రాంతి సినిమాల ప్రమోషన్స్ లో రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ గేర్ మార్చింది. మొన్ననే టైటిల్ టీజర్ వదిలారు. ఇప్పుడు తొలి పాట ‘బెల్లా బెల్లా’ రిలీజ్ చేసి మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. రవితేజ, ఆషికా రంగనాథ్ కాంబినేషన్లో రూపొందిన పాట ఇది.
భీమ్స్ ఎప్పటిలానే మంచి బీట్ వున్న ట్యూన్ కంపోజ్ చేశారు. సురేశ్ గంగుల రాసిన సాహిత్యం క్యాచిగా వుంది. గాయకులు నకాశ్ అజీజ్, రోహిణి పాడిన తీరు ఎనర్జిటిక్ గా వుంది. ఇది పక్కా రవితేజ మార్క్ సాంగ్. ఫారిన్ లో షూట్ చేసిన ఈ పాటలో రవితేజ, ఆషికా చేసిన స్టయిలీష్ డ్యాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సంక్రాంతికి రాబోతన్న సినిమాల్లో మనశంకర వరప్రసాద్ ప్రమోషన్స్ లో ముందజలో వుంది, ఇప్పటికే మీసాల పిల్ల సాంగ్ బాగా వైరల్ అయ్యింది. ఇపుడు రవితేజ కూడా తనదైన బీట్ తో వచ్చారు. ఈ రెండూ సినిమాలకీ భీమ్స్ మ్యూజిక్ ఇవ్వడం మరో విశేషం.
