రవితేజ కెరియర్లోనే క్లీన్ అండ్ నీట్ హిట్ గా నిలిచిపోయింది ‘కిక్’. సురేందర్ రెడ్డిలోని కమర్షియల్ యాంగిల్ కి ఈ సినిమా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. తమన్‌కి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా. అన్ని రకాలుగా గుర్తుండిపోయే ప్రాజెక్ట్ ఇది. ఆ తరవాత ‘కిక్ 2’ వచ్చినా సక్సెస్ కాలేదు. ఇప్పుడు సురేందర్ రెడ్డి డౌన్ ఫాల్ లో ఉన్నాడు. తనకు ఓ హిట్ చాలా అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ రవితేజతో చేతులు కలపబోతున్నట్టు టాక్.
సురేందర్ రెడ్డి – రవితేజ మధ్య ఓ కథకు సంబంధించిన చర్చలు జోరుగా సాగుతున్నాయి. సూరితో మళ్లీ పనిచేయడానికి రవితేజ కూడా ఉత్సాహం చూపిస్తున్నట్టు టాక్. ఏజెంట్ తరవాత సురేందర్ రెడ్డి మరో ప్రాజెక్ట్ చేయలేదు. అయితే ఆ మధ్యలో చాలామందికి కథలు వినిపించాడు. వెంకటేష్ దగ్గరకు ఓ కథ పట్టుకొని వెళ్లాడు. ఆ సినిమా దాదాపు ఓకే అయిపోతోంది అనుకొంటున్న తరుణంలో.. వెంకీ – త్రివిక్రమ్ సినిమా లాక్ అయ్యింది. దాంతో వెంకీకి సురేందర్ రెడ్డి సినిమాని వదులుకోక తప్పలేదు. ఇప్పుడు ఇదే కథతో రవితేజ తో ప్రాజెక్ట్ సెట్ చేసుకొన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ తో సినిమా కూడా దాదాపుగా ఓకే అయ్యే స్టేజీలో వుంది. రవితేజ, పవన్ కల్యాణ్ ఇద్దరితోనూ సూరి టచ్‌లో ఉన్నాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. పవన్ తో సినిమా లేట్ అవుతుందంటే.. ఈలోగా రవితేజ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్తాడు. పవన్ అందుబాటలో ఉంటే.. ఆ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. పవన్ నుంచి ఓ క్లారిటీ వస్తే కానీ సూరి నెక్ట్స్ సినిమా ఏమిటన్న విషయంలో క్లారిటీ రాదు. ఏది ఏమైనా కిక్ కాంబో.. మళ్లీ సెట్స్ పైకి వెళ్లడం మాత్రం ఖాయం.
