ఎమ్మెల్సీ పోతుల సునీత బీజేపీలో చేరిపోయారు. వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి చాలా కాలం అయింది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఆమోదం లభించిన తర్వాత బీజేపీలో చేరాలని అనుకున్నారు కానీ.. వైసీపీకి చెందిన మండలి చైర్మన్ మోషన్ బాబు మాత్రం రాజీనామాలపై నిర్ణయం తీసుకోవడం లేదు. మొత్తం ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు. అందరివీ పెండింగ్ లో ఉన్నాయి.కొంత మంది కోర్టులో కూడా పిటిషన్లు వేశారు.
పోతుల సునీత మొదట తెలుగుదేశంలో ఉండేవారు. ఆమె భర్త పోతుల సురేష్. పరిటాల రవికి అత్యంత సన్నిహితుల్లో ఒకరు. పరిటాల రవి చనిపోయిన తర్వాత ఆజ్ఞాతంలోకి వెళ్లారు. చాలా కాలం తర్వాత బయటకు వచ్చారు. టీడీపీలో పోతుల సునీతకు మొదట ఆలంపూర్ జడ్పీటీసీగా గెలిచారు. తరవాత ఎమ్మెల్యేగా పోటీ చేసిఓడిపోయారు. కానీ పరిటాల రవి హత్య చాలా కాలం రాజకీయాల్లో లేరు. పోతుల సురేష్ అజ్ఞాతం నుంచి వచ్చిన తరవాత .. ప్రకాశం జిల్లాలోని చీరాలలో టీడీపీ తరపున రాజకీయాలు చేశారు.
అయితే టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయినా ఇంచార్జ్ గా ఇచ్చి.. ఎమ్మెల్సీ పదవి ఇస్తే.. టీడీపీ ఓడిపోయిన తర్వాత ఆమె వైసీపీలో చేరారు. చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని కూడా తిట్టారు. చివరికి వైసీపీ ఓడిపోగానే మళ్లీ ఆ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. కానీ టీడీపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ లభించలేదు. చివరికి బీజేపీలో చేరిపోయారు.
