తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేసి .. పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సతీష్ అనే సీఐ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. సిట్ ఎదుట హాజరయ్యేందుకు రైలులో బయలుదేరిన ఆయన చనిపోయి పడి ఉన్నారు. రైలు ఢీకొనడం వల్ల చనిపోయారన్నట్లుగా సీన్ క్రియేట్ చేసినట్లుగా అక్కడ పరిస్థితులు ఉండటంతో పోలీసులు ఉన్నత స్థాయి దర్యాప్తు జరుపుతున్నారు.
అయితే ఈ లోపే వైసీపీకి చెందిన కీలక అనుమతులు తెరపైకి వచ్చి సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడని.. ఈ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహారం మరింత అనుమానాస్పదంగా ఉంది. మామూలు మరణం అయినా సరే రాజకీయంగా ఉపయోగపడుతుందని అనుకుంటే హత్య అని అడ్డగోలుగా వాదించే ఆయన.. అత్యంత కీలకమైన కేసులో ఫిర్యాదిదారు, సాక్షిగా ఉన్న ఓ పోలీసు అనుమానాస్పదంగా చనిపోతే ఆత్మహత్య అని డిక్లేర్ చేసి మాట్లాడుతున్నారు. ఆయనతో పాటు వైసీపీ బ్యాచ్ అంతా ఇదే వాదిస్తోంది. అదే సమయంలో భూమన ఓ దర్యాప్తు అధికారిని కూడా టార్గెట్ చేసి బెదిరించేలా మాట్లాడుతున్నారు.
పరకామణి చోరీని గుర్తించి నిందితుడు రవికుమార్ ను పట్టుకుంది…అప్పట్లో టీటీడీ విజిలెన్స్ లో పని చేస్తున్న సతీష్ కుమారే. ఆయన ఫిర్యాదు మేరకే కేసు నమోదు అయింది. తర్వాత ఆయనపై ఒత్తిడి చేయించి రాజీ చేయించారు. ఎవరు అలా చేశారన్నది సిట్ కు ఆయన వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంది. అలా ఇచ్చేందుకు వెళ్తున్న సమయంలోనే ఆయన చనిపోయారు. రవికుమార్ మరో వైపు.. కోర్టులో ఏసీబీ విచారణకు వ్యతిరేకంగా పిటిషన్ వేశారు. ఇలా జరగడం వెనుక ఖచ్చితంగా అదృశ్య శక్తులు ఉన్నాయని అనుకోకుండా ఎలా ఉండగలరు?
