నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు చాలా కాలంగా సెట్స్‌పై నిలిచిపోయిన సినిమా. రిలీజ్ విషయంలో ఎన్నో సందిగ్ధాలు ఎదుర్కొన్న ఈ చిత్రం ఎట్టకేలకు రిలీజ్ డేట్‌ను ఖరారు చేసుకుంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి రానుంది.
ఇది పక్కా కామెడీ ఎంటర్టైనర్. సితార నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘సంక్రాంతి ప్రోమో’ పేరుతో ఓ జ్యువెలరీ యాడ్ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో నవీన్ పొలిశెట్టి – మీనాక్షి జోడి బావుంది. అంతేకాదు, సంక్రాంతి వైబ్‌ని అందించేలా “రాజు సంక్రాంతికకి వస్తున్నాడు” అనే కోరస్ కూడా జోడించారు.
ఈసారి సంక్రాంతి బరిలో చిరంజీవి – అనిల్ సినిమా, ప్రభాస్ రాజాసాబ్, రవితేజ సినిమాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు నవీన్ పొలిశెట్టి కూడా ఆ జాబితాలో చేరాడు. సంక్రాంతికి పర్ఫెక్ట్ కంటెంట్ అనే నమ్మకంతోనే నిర్మాతలు ఇంత పెద్ద పోటీలో కూడా బరిలో దిగుతున్నారు.
