తెలంగాణలోని రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటున్న తరుణంలో మరో భారీ ఎక్స్ పో నిర్వహించడానికి నరెడ్కో ఏర్పాట్లు చేస్తోంది. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (NAREDCO) తెలంగాణ ఛాప్టర్ ఆధ్వర్యంలో 14వ ఎడిషన్ ‘NAREDCO తెలంగాణ ప్రాపర్టీ షో’ను ఏర్పాటు చేయనుంది. ఈ మూడు రోజుల ఈవెంట్ అక్టోబర్ 25 నుంచి 27 వరకు హైదరాబాద్‌లోని HITEX ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనుంది.
రెసిడెన్షియల్, ఆఫీస్ కమర్షియల్, రిటైల్ కమర్షియల్ స్పేస్‌లతో పాటు వివిధ రకాల ఆస్తులను బిల్డర్లు ప్రదర్శించనున్నారు. నిర్మాణ రంగానికి సంబంధించినఅన్న అంశాలతో షో రియల్ ఎస్టేట్ రంగంలో అతిపెద్ద ఈవెంట్‌గా మారనుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గత కొన్ని ఏళ్లుగా డబుల్ డిజిట్ గ్రోత్తో ముందుండటంతో, ఈ ప్రాపర్టీ షో కొత్త ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను సృష్టించనుంది.
హైదరాబాద్‌లోని బలమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, తెలంగాణ ప్రభుత్వం పాలసీలు రియల్ ఎస్టేట్ రంగాన్ని ముందుకు నడిపిస్తున్నాయని వ్యాపారులు అంటున్నారు. 100కి పైగా డెవలపర్లు, బిల్డర్లు పాల్గొననున్నారు. కస్టమర్లకు ఆకర్షణీయ ఆఫర్లు, డిస్కౌంట్లు, ఈజీ పేమెంట్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఇది కేవలం షో మాత్రమే కాకుండా, బయర్-సెల్లర్ కనెక్ట్‌ను బలోపేతం చేసే ప్లాట్‌ఫామ్‌గా రూపొందించారు.
