నారా లోకేష్ మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. గత వారమే ఆయన ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి మోడీతో దాదాపుగా గంట సేపు చర్చలు జరిపి వచ్చారు. అయితే ఈ సారి ఢిల్లీకి వెళ్లేది కేంద్రమంత్రులతో సమావేశానికి కాదు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో ఎంపీలను సమన్వయం చేయడానికి వెళ్తున్నారు. ఎన్డీఏ కూటమి తరపున కీలక బాధ్యతలు తీసుకోనున్నారు. అంతకు ముందు కోయంబత్తూరు వెళ్తారు. అక్కడ ఓ నేషనల్ మీడియా చానల్ నిర్వహిస్తున్న కాంక్లేవ్ లో పాల్గొంటారు. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తారు.
నారా లోకేష్ జాతీయస్థాయిలో తెలుగుదేశం పార్టీ ప్రజెన్స్ ను.. బలంగా చూపిస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో కేవలం ఓ పార్టీగానే కాకుండా.. కూటమి బలాన్ని చాటే విషయంలో తనదైన పాత్ర పోషిస్తున్నారు. ఇది బీజేపీ జాతీయ నాయకత్వాన్ని కూడా ఆకర్షిస్తోంది. నారా లోకేష్ నాయకత్వం వ్యూహాత్మకం, హడావుడి లేకుండా.. ఎంత అవసరమో అంత మేర వ్యూహాలు అమలు చేయడం వారిని అబ్బుర పరుస్తోంది. అందుకే ప్రధానమంత్రి నారా లోకేష్.. టీడీపీకి.. నేషనల్ ఫేస్‌గా నారా లోకేష్‌ను ప్రశంసిస్తున్నారు.
చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు … నారా లోకేష్ ఆ అంశాన్ని జాతీయ స్థాయి చర్చనీయాంశంగా చేయడంలో కీలక పాత్ర పోషించారు. జాతీయ మీడియాలో బలమైన వాదనలు వినిపించారు. జాతీయ పార్టీ నేతలతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. తండ్రికి తగ్గ కుమారుడని.. రాజకీయాలను ఆయనదైన శైలిలో బ్యాలెన్స్ చేస్తున్నారన్న ప్రశంసలు ఇతర పార్టీల నేతల నుంచి వస్తున్నాయి.
