ఏపీలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించేందుకు నారా లోకేష్ యూకేలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు రోడ్ షోలో పాల్గొన్నారు. దీన్ని సీఐఐ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్-యుకే బిజినెస్ ఫోరం ఏర్పాటు చేసింది. విశాఖపట్నంలో జరగబోయే సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 సన్నాహాకంగా లోకేష్ ఈ పర్యటనకు వచ్చారు.
లండన్‌లో సీనియర్ బిజినెస్ లీడర్లతో చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాల గురించి ప్రజెంటేషన్ ఇచ్చారు. లండన్ లో ఉన్న టాప్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ లోకేష్ తో సమావేశానికి హాజరయారు. ఫైర్‌సైడ్ చాట్ కూడా నిర్వహించారు. ఇన్వెస్టర్ల సందేహాలకు సమాధానాలిచ్చారు. రాష్ట్రంలో ఐటీ, గ్రీన్ ఎనర్జీ, మాన్యుఫాక్చరింగ్ వంటి సెక్టర్లలో బిగ్-టికెట్ ఇన్వెస్ట్మెంట్లు ఆకర్షించడం. ఆంధ్రప్రదేశ్ పాలసీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోర్టుల వంటి అంశాల్లో ఉన్న అవకాశాలను వివరించారు. ఈ రోడ్ షో ద్వారా గ్లోబల్ ఇన్వెస్టర్ల ఆసక్తి పెరిగిందని లండన్ బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఇది పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేసుకునే పర్యటన కాదు. కేవలం విశాఖ పార్టనర్ షిప్ సమ్మిట్ కోసం ముందస్తు ప్రిపరేషన్. అప్పటి వరకూ ఆసక్తి చూపించిన సంస్థలతో ఫాలో అప్ లో ఉండి.. ఆ సమ్మిట్ కల్లా.. పూర్తి స్థాయిలో ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. దాదాపుగా వివిధ రంగాల్లో పది లక్షల కోట్ల పెట్టుబడికి వివిధ సంస్థలు ప్రాథమికంగా ఆసక్తి చూపించాయని.. వాటితో ఫాలో అప్ చేసుకుని విశాఖ సమ్మిట్ నాటికి ఒప్పందాలు పూర్తి చేసుకునే అవకాశం ఉంది.
నారా లోకేష్ పెట్టుబడుల్ని ఆకర్షించడంలో ప్రత్యేకమైన ప్రతిభ చూపిస్తున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన కోసం.. పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు శ్రమిస్తున్నారు. ఆ దిశగా ముందడుగు వేస్తున్నారు.
