ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పెట్టుబడుల పండుగ జరుగుతోంది. దిగ్గజ పారిశ్రామిక సంస్థలు, టెక్ ఇండస్ట్రీలు ఏపీ వైపు చూస్తున్నాయి. దానికి కారణం నారా లోకేష్. ఆయన పదవి చేపట్టినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ పారిశ్రామికవేత్తలతో భేటీకి అవకాశం ఉంటే అక్కడికి వెళ్లి ఏపీని ప్రమోట్ చేశారు. ఓ సారి అమెరికా వెళ్లినప్పుడు గూగుల్ క్లౌడ్ హెడ్ తో జరిగిన సమావేశంతో పెట్టిన ప్రతిపాదనలో ఏఐ హబ్ విశాఖకు వచ్చేందుకు బీజం పడింది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి.
పారిశ్రామిక వేత్తలను ఆకర్షించడంలో తండ్రిని మించిన తనయుడు..
ఏపీకి పారిశ్రామికవేత్తలను ఆకర్షించడంలో చంద్రబాబును మించి నారా లోకేష్ పనితీరు ఉందని అనుకోవచ్చు. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ ను హైదరాబాద్ తీసుకురావడానికి చంద్రబాబు బిల్ గేట్స్ తో ఐదు నిమిషాల సమావేశాన్ని 40 నిమిషాలకు పెంచుకుని .. హైదరాబాద్ చరిత్రను మలుపు తిప్పారు. అక్కడ స్పేస్ లేదు కానీ చంద్రబాబు స్పష్టించుకున్నారు. నారా లోకేష్ కూడా అదే బాటలో ఉన్నారు. అవకాశాలు ఉన్నాయా.. స్పేస్ ఉందా అని చూసుకోవడం లేదు. స్వయంగా సృష్టించుకుని పారిశ్రామిక వర్గాలతో టచ్ లోకి వెళ్లిపోతున్నారు. ఎన్నో ప్రయత్నాలు విఫలమై ఉండవచ్చు కానీ.. కొన్ని ప్రయత్నాలు సక్సెస్ అయితే చాలు. ఏపీ కోసం లోకేష్ మంచి విజయం సాధించినట్లే. ఆ స్ఫూర్తితోనే నారా లోకేష్ ప్రయత్నించారు.
భయపడి వెళ్లిపోయిన వారందరికీ నమ్మకం కలిగించిన లోకేష్
నిజానికి ఐదు సంవత్సరాల జగన్ పాలన కళ్ల ముందు ఉన్న సమయంలో ఎవరైనా ఇన్వెస్టర్లు ఏపీకి రావడం చిన్న విషయం కాదు. మళ్లీ ఆయన వస్తే అన్న భయంతో ఎక్కువ మంది ఎందుకొచ్చిన తిప్పలని రారు. కానీ నారా లోకేష్ అందరి భయాలను పటాపంచలు చేసి.. మళ్లీ తీసుకు వస్తున్నారు. రెన్యూపవర్ కూడా అలాంటిదే. జగన్ రద్దు చేసిన పీపీఏల ఖాతాలో రెన్యూపవర్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చినా.. కేంద్రం హెచ్చరించినా.. కేంద్ర మంత్రి షెకావత్ చాలా సార్లు చెప్పినా జగన్ పీపీఏలను రద్దు చేసి.. వెళ్లగొట్టారు. తర్వాత వేరే కంపెనీలతో 30 ఏళ్లకు పీపీఏలు చేసుకుని తన చేతకాని తనాన్ని బయట పెట్టుకున్నారు. ఇప్పుడు జగన్ వికృతత్వతానికి బలైపోయిన వాళ్లంతా మళ్లీ ఏపీకి వస్తున్నారు. ఎందుకంటే.. జగన్ మళ్లీ రాడని వారికి నమ్మకం కలిగింది. లూలు సహా అనేక కంపెనీలు.. ఏపీ నుంచి వెళ్లిపోయాయా.. మళ్లీ తిరిగి వస్తున్నాయి. ఇందు కోసం నారా లోకేష్.. తిరగని మెట్రో లేదని అనుకోవచ్చు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు ఎన్ని సార్లు వెళ్లాలో చెప్పాల్సిన పని లేదు.
20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంలో సక్సెస్ కావడం ఖాయం
నారా లోకేష్ ఓ టార్గెట్ పెట్టుకున్నారు. ఐదు సంవత్సరాల్లో ఏపీ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని టార్గెట్ పెట్టుకున్నారు. వైట్ కాలర్ జాబ్స్ చేయగలిగే వాళ్లకు ఏపీలోనే ఆ ఉద్యోగాలు రావాలంటే ఆ స్థాయి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు రావాలి. అందుకే ఆ ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు స్కిల్ సెన్సెస్ చేస్తున్నారు. ఏపీలో వచ్చే కంపెనీలకు సరిపడా స్కిల్స్ ఉన్న వారందరికీ ఏపీలోనే ఉద్యోగాలు వస్తాయి. కావాల్సిన వారికి స్కిల్ ట్రైనింగ్ ఉంటుంది. వచ్చే రెండేళ్లలో ఏపీ యువత అయితే ఉద్యోగాల్లో లేకపోతే స్కిల్ ట్రైనింగ్ లో చాలా బిజీగా ఉంటారని అనుకోవచ్చు.
