దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చేయని ప్రయోగాలు లేవు. ఆయన అన్నీ జానర్స్ టచ్ చేశారు. చాలా మందికి ఆయన ఫేవరేట్ డైరెక్టర్. అందులో నాగ్ అశ్విన్ కూడా వున్నారు. సింగీతం అంటే ఆయనకి చాలా ఇష్టం. ఇప్పుడు సింగీతం మళ్లీ మెగాఫోన్ పడుతున్నారని టాక్. ఈ చిత్రాన్ని నాగ అశ్విన్ నిర్మిస్తారని ఇన్ సైడ్ వర్గాల టాక్.
మహానటి, కల్కి 2898 AD సినిమాలకు సింగీతం వర్క్ చేశారు. ఆయన దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని నాగ్ అశ్విన్ కి ఎప్పటినుంచో వుండేది. ఇప్పుడు ప్రాజెక్ట్ ముందుకు కదులుతోంది. ఈ సినిమా పూర్తిగా సింగీతం మార్క్ లో వుంటుంది. నటీనటులంతా కొత్తవారే. ఈ ప్రాజెక్ట్‌కు సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ఎంపిక చేసినట్టు సమాచారం. ఒక మాస్టర్ క్లాసిక్ మైండ్, మాడర్న్ ఫిల్మ్‌మేకర్ కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఆసక్తికరం.
