తాడిపత్రిలో మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించుకుని ఇల్లు కట్టుకున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంటిలో కొంత భాగాన్ని తానే కూల్చేసుకున్నారు. ఎప్పుడు బుల్డోజర్లు వచ్చి విరుచుకుపడతాయోనని కంగారుతో .. నిద్రలేకుండా గడపడం కన్నా..కబ్జా చేసిన స్థలం వరకూ .. కూల్చేసుకుని ఖాళీగా ఉంచండం మంచిదనుకున్నారు. అన్నట్లుగా కూల్చివేసుకున్నారు.
ఇటీవల పెద్దారెడ్డి ఇంట్లో మున్సిపల్ అధికారులు కొలతలు తీశారు. రెండు సెంట్లు ఆక్రమిస్తున్నట్లుగా గుర్తించారు. పదిసెంట్లు ఆయనకు ఉంటే పన్నెండు సెంట్లలో ఇల్లు కట్టుకున్నారు. ఆ విషయం సర్వే అధికారులు నిర్దారించారు. వారు సర్వే చేసినప్పుడు ఇంట్లోనే ఉన్న ఆయన.. సంతకం పెట్టేందుకు నిరాకరించారు. కోర్టుకు వెళ్లారు. విషయం కోర్టులో ఉండగానే.. పెద్దారెడ్డి తన ఇంటిలో కొంత భాగాన్నికూల్చి వేసుకున్నారు.
పెద్దారెడ్డి ఇలా ఆక్రమించిన స్థలంలో కట్టిన దాన్ని కూల్చివేస్తున్నారని తెలియడంతో మున్సిపల్ అధికారులు వెళ్లారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమని.. సర్వే రిపోర్టు పై కోర్టు నిర్ణయం వచ్చే వరకూ ఉండాల్సిందని వారు పెద్దారెడ్డికి చెప్పారు. అయితే కబ్జా చేస్తే కోర్టు కూడా ఆగ్రహిస్తుందని తెలుసు కాబట్టి… మొత్తం ఇంటిని కూల్చివేయకుండా ముందుగానే కబ్జా చేసిన స్థలం వరకూ కూల్చివేసుకున్నట్లుగా కనిపిస్తోంది.
