నందమూరి బాలకృష్ణ వందో చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ హ్యాండిచ్చిన సంగతి తెలిసిందే. ఆ స్థానంలో సంగీత దర్శకుడిగా కంచెకి పనిచేసిన చిరంతన్ భట్ని ఎంచుకొన్నారు. అయితే మధ్యలో చాలా ప్రయత్నాలే జరిగాయి. ఓ దశలో కీరవాణిని అప్రోచ్ అయ్యారు. ఎందుకంటే ఇలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలకు ఆర్.ఆర్ అందివ్వడంలో ఆయన దిట్ట. క్రిష్‌తో వేదం సినిమాకి పనిచేశారాయన. వాళ్లిద్దరి మధ్య మంచి రాపో ఉంది. కీరవాణికీ ఈ సినిమా చేయాలనిపించిందట. కానీ.. ఒప్పుకోలేదు. దానికి కారణం బాహుబలి సినిమానే. ”బాహుబలి చాలా పెద్ద ప్రాజెక్టు. అది ఉండగా మరో సినిమా చేయలేను” అని సున్నితంగా చెప్పి తప్పుకొన్నారట కీరవాణి. ఆయన చెప్పిన దాంట్లో రీజన్ ఉంది కాబట్టి.. ఆయన్ని పెద్దగా బలవంతం చేయలేదట.
మధ్యలో ఇళయరాజా పేరు ప్రస్తావనకు వచ్చింది. అయితే… రుద్రమదేవి విషయంలో చాలా మందికి అసంతృప్తి ఉంది. ఆ సినిమాకి ఇళయరాజా పనిచేశారు. అయితే… పాటల పరంగా, నేపథ్య సంగీతం పరంగా ఇళయరాజా మార్క్ ఆ సినిమాలో కనిపించలేదు. ఇళయరాజా మ్యూజిక్‌లో మ్యాజిక్ తగ్గిపోయిందని, ఆయన ఆర్.ఆర్ ఇవ్వడంలో శ్రద్ద పెట్టడం లేదని విమర్శలొచ్చాయి. దాంతో ఇళయరాజానీ పక్కన పెట్టాల్సివచ్చింది. చిరంతన్ భట్ని తీసుకొంటానంటే బాలయ్య అభ్యంతరం చెప్పలేదని అందుకే కంచె టెక్నీషియన్‌కి క్రిష్ మరో అవకాశం ఇచ్చాడట. ఒకట్రెండు రోజుల్లో భట్.. పనిలో దిగిపోనున్నాడని టాక్.
