కవిత విషయంలో కేటీఆర్ ఎంత వ్యతిరేకంగా ఉన్నా.. అన్న విషయంలో సోదరి మాత్రం పాజిటివ్ గానే ఉంటున్నారు. ఫార్ములా ఈ రేసు కేసు విషయంలో కేటీఆర్ ను వేధిస్తున్నారని కవిత అంటున్నారు. వాళ్ల మీద, వీళ్ల మీద కేసులు పెట్టడమే బీజేపీ కి ఉన్న పని… బీజేపీ, కాంగ్రెస్ కలిసి ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతున్నారని తేల్చారు. జనంబాట కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గాల్లో తిరుగుతున్న ఆమె.. ఏం జరుగుతుందో ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారని హెచ్చరించారు.
దేశంలో కక్ష పూరిత రాజకీయాలు జరుగుతున్నాయి అనడానికి తెలంగాణలో పెడుతున్న అక్రమ కేసులే నిదర్శనమన్నారు.
మొదట్లో కవిత కేటీఆర్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు కానీ వెంటనే తన పాలసీ మార్చేసుకున్నారు. కేటీఆర్ ను సమర్థిస్తున్నారు. కానీ హరీష్ రావును టార్గెట్ చేస్తున్నారు. ఆయన వల్ల కేసీఆర్, కేటీఆర్ కు సమస్యలు వస్తాయని గట్టిగా నమ్ముతున్నారు. అదే చెబుతున్నారు. చాలా అవినీతి ఆరోపణలు కూడా చేస్తున్నారు. ముందు హరీష్ రావును బీఆర్ఎస్ నుంచి బయటకు పంపేలా చేయాలని అనుకుంటున్నారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి హరీష్ రావే కారణం అని ఆమె గట్టిగా నమ్ముతున్నారు.
కేటీఆర్ మాత్రం కవిత విషయంలో ఏ మాత్రం పాజిటివ్ గా లేరు. ఎప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. కుటుంబ కార్యక్రమాలకూ పిలవడంలేదు. ఓ రకంగా ఈ విషయంలో కవిత సానుభూతి పొందుతున్నారని అనుకోవచ్చు.
