కార్తికి తెలుగు సినిమాలపై ప్రత్యేక శ్రద్ధ. తన ప్రతి సినిమాని డబ్బింగ్ రూపంలో తీసుకువచ్చేటప్పుడు వీలైనంత తెలుగు నేటివిటీ ఉండేలా చూసుకుంటాడు. మంచి తెలుగు టైటిల్, డైలాగ్స్ మరీ మక్కికి మక్కిలా కాకుండా తెలుగుదనం ఉండేలా చూస్తాడు. పాత్రల పేర్లలో కూడా మార్పులు కనిపిస్తాయి. ఇప్పుడు అన్నగారు వస్తారు అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. చాలా గమ్మత్తుగా ఉంది. ట్రైలర్ లో కథ చెప్పలేదు కానీ పాలిటిక్స్, సినిమా, పోలీస్ ఈ మూడు వ్యవస్థలు మిళితమైన ఉన్న కథ. ఇందులో కార్తీ ఎంజీఆర్ ఫ్యాన్. కథలో ఎంజీఆర్ పార్టీ కూడా చాలా కీలకం. తెలుగులోకి వచ్చేసరికి ఎంజీఆర్ ప్లేస్ లో ఎన్టీఆర్ ని వాడుకున్నారు. ఎన్టీఆర్ ఆశీస్సులతో అంటూ టైటిల్ కూడా వేశారు.
ఫన్, డ్రామా అన్ని కూడా ట్రైలర్ లో కనిపించాయి. సినిమాపై ఆసక్తి కలిగించేలా ఈ ట్రైలర్ కట్ చేశారు. డిసెంబర్ 12న సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తుంది. అయితే ఏవో ఆర్థిక పరమైనవ్యవహారాలతో ఈ సినిమాపై కొందరు కోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం ఆ కేసు నడుస్తుంది. 8వ తేదీన తుది తీర్పు వస్తుంది. అయితే నిర్మాతలు అన్ని సమస్యలు పరిష్కారమైపోతాయనే ధీమాతోనే ప్రమోషన్స్ మొదలుపెట్టారు.
