భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీపై చేస్తున్న తప్పుడు ప్రచారాల్లో భాగంగా విగ్రహం అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఏళ్ల తరబడి రోడ్డుపక్కన పడేసి ఉన్న సగం చెక్కిన విగ్రహంతో రాజకీయం చేశారు. ఇదంతా ఎందుకయ్యా అంటే.. దేవుడి సొమ్ముల్ని దోచుకున్నట్లుగా తేలడంతో ఆయనను టీటీడీ విజిలెన్స్ అరెస్టు చేయడానికి సిద్ధమైంది. ఆ సమాచారం తెలియగానే.. ఈ నాటకం ఆడారు. ఈ విషయం ఎవరో కాదు.. స్వయంగా భూమన కుమారుడు అభినయ్ రెడ్డే ప్రకటించారు.
భూమన కరుణాకర్ రెడ్డి దేవుడి సొమ్ములను అడ్డంగా దోచుకున్నారు. ఎన్నికలకు ముందు టీటీడీ చైర్మన్ పదవి బీసీలకు ఇస్తామని ప్రచారం చేసుకున్న వైసీపీ నేతలు చివరికి భూమనకు ఇచ్చారు. తన కుమారుడ్ని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి అవసరమైన నిధుల కోసం ఆయన టీటీడీ చైర్మన్ పోస్టును ఒత్తిడి చేసి తీసుకున్నారు. ఆయన టీటీడీ చైర్మన్ అయిన అనతి కాలంలో నెయ్యి స్కాంతో పాటు అనుమతి లేకుండా పెద్ద ఎత్తున ఇంజినీరింగ్ పనులకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు ముందస్తు చెల్లింపులు చేసి కమిషన్లు తీసుకున్నారు.
ఈ విషయాన్ని విజిలెన్స్ అధికారులకు కాంట్రాక్టర్లు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ దర్యాప్తులోనూ అసలు విషయం బయటపడింది. దీంతో కేసు నమోదు చేసి.. ఆయనను అరెస్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే భూమన అభినయ్ రెడ్డి.. భయపడం.. గుండెల్లో నిద్రపోతామని.. ఆయన తండ్రి మాట్లాడే పాస్టర్ తరహా భాషలో పోస్టు చేశారు. అప్పుడే అందరికీ క్లారిటీ వచ్చింది. అరెస్టు చేస్తారని తెలిసే ఈ డ్రామాలు ప్రారంభించారని. వైసీపీ నేతలకు ఇలాంటి తెలివితేటలకు తక్కువేం ఉండదు.
