భారత్ లో మిలీనియం సిటీగా గుర్గాం మారుతోంది. కార్పొరేట్ క్యాపిటల్‌గా మారింది. సైబర్ సిటీ, ఉద్యోగ్ విహార్‌లో 500+ ఫార్చ్యూన్ 500 కంపెనీలు, IT ఫర్ములు, స్టార్టప్‌లు ఫ్లిప్‌కార్ట్, పేటీఎం వంటివి ఉన్నాయి. 2025లో ఉద్యోగాలు 20% పెరిగాయి. ఎకానమిక్ బూస్ట్. హౌసింగ్ బూస్ట్ ను పెంచింది. అందుకే గుర్గాం భారతదేశంలో బిలియనీర్లకు ప్రధాన హాట్‌స్పాట్‌గా మారింది. ఇక్కడి లగ్జరీ రియల్ ఎస్టేట్ బూమ్, IT-స్టార్టప్ హబ్ స్థితి, ఢిల్లీకి సమీపత వల్ల హై-నెట్‌వర్త్ ఇండివిజువల్స్, బిలియనీర్లు ఇక్కడే స్థిరపడుతున్నారు.
గోల్ఫ్ కోర్స్ రోడ్, DLF కామెలియాస్, సెక్టార్ 44, DLF సైబర్ సిటీ వంటి ప్రాంతాలు ‘ఉత్తర భారతదేశం బిలియనీర్ల రో’గా పేరుపొందాయి – ముంబై అల్టామౌంట్ రోడ్ లేదా న్యూయార్క్ బిలియనీర్ల రోతో పోల్చుతున్నారు. GIS మ్యాపింగ్, రియల్-టైమ్ వాటర్ మానిటరింగ్ వంటి టెక్ ఇనిషియేటివ్‌లు సస్టైనబుల్ డెవలప్మెంట్ను ప్రోత్సహిస్తున్నాయి. డ్వార్కా ఎక్స్‌ప్రెస్‌వే పూర్తి, రాపిడ్ మెట్రో విస్తరణలు, ఢిల్లీ-జైపూర్ హైవేలు ట్రాఫిక్‌ను 30% తగ్గించాయి. సెక్టార్ 90 వంటి ఏరియాలు, సస్టైనబుల్ డిజైన్‌తో గ్రీన్ స్పేసెస్, సైక్లింగ్ ట్రాక్‌లు మారుతున్నాయి.
గురుగ్రామ్, వేగవంతమైన అర్బనైజేషన్‌తో భవిష్యత్ రియల్ ఎస్టేట్ హబ్‌గా మారుతోంది. దానికి తగ్గ మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. ఢిల్లీ నుంచి అతి దగ్గర కావడంతో.. ఎక్కడ మంది అక్కడ స్థరపడేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. రాబోయే రోజుల్లో ముంబైతో పోటీ పడే అవకాశం ఉంది.
