భారతదేశంలోని టైర్-2 సిటీల్లో గుంటూరు రియల్ ఎస్టేట్ మార్కెట్ అద్భుతమైన రికార్డు సాధిస్తోంది. గత సంవత్సరం 50 ఆస్తి విలువల పెరుగుదల సాధించింది. ఈ నగరం, 2025లో మరో 15-20% భారీ గ్రోత్ సాధిస్తుందని నిపుణులు అంచనా. టైర్ 2 సిటీల్లో జైపూర్ తర్వాత రెండో స్థానంలో నిలిచిన గుంటూరు, ఇప్పుడు ఇన్వెస్టర్ల ‘హాట్ ఫేవరెట్’గా మారింది.
అమరావతి క్యాపిటల్ ప్రాజెక్టుల పునరుద్ధరణ, TDP 2024 ఎన్నికల విజయం, ఇన్ఫ్రా డెవలప్మెంట్ – ఈ మూడు కారకాలు గుంటూరు ప్రాపర్టీ మార్కెట్‌ను ‘బూమ్’గా మార్చాయని జాతీయ స్థాయి రియల్ ఎస్టేట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. విజయవాడ-గుంటూరు కనెక్టివిటీ మెరుగుపడుతోంది. అమరావతి క్యాపిటల్ ప్రాజెక్టుల వేగవంతం రియల్ ఎస్టేట్ కు భూమ్ ఇచ్చింది.
గోరంట్ల ప్రాంతం రెంటల్ ఆదాయానికి చాంపియన్ గా మారింది. అమరావతి, మంగళగిరి, కాజా ల్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, CRDA అప్రూవల్ లో ప్లాట్లు అమ్ముతున్నారు. ర. 40 లక్షల నుంచి రూ.2.3 కోట్ల వరకూ ప్లాట్లు సైజును బట్టి అమ్ముతున్నారు. గోరంట్ల, మంగళగిరి, MGR ఇన్నర్ రింగ్ రోడ్ లో రెడీ టు మూవ్ ఇళ్లను అమ్ముతున్నారు. 1BHK నుంచి 6+BHK. వరకూ ఇళ్లను బిల్డర్లు నిర్మిస్తున్నారు.
అయితే రేట్లు ఎంత పెరుగుతున్నా ఇప్పటికీ హైదరాబాద్, బెంగళూరు కంటే చాలా తక్కువ తరలే. కానీ పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. అందుకే ఎక్కువ మంది గుంటూరులో ఇళ్లు, స్థలాలపై పెట్టుబడికి ఆసక్తి చూపిస్తున్నారు.
