సినిమా బండి, శుభం, పరదా ఇలా మూడు సినిమాలతో తన మార్క్ చూపించే ప్రయత్నం చేశాడు ప్రవీణ్ కాండ్రేగుల. సినిమా బండి ఓ ప్రయోగం. శుభం నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టింది. పరదాలో ఓ బలమైన కథని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ బాక్సాఫీసు దగ్గర నిలబడలేకపోయింది. ఇప్పుడు ఈ దర్శకుడికి ఓ మంచి ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల ఆయన సిద్దు జొన్నలగడ్డకు ఓ కథ చెప్పారని టాక్. ఆ కథ సిద్దుకి బాగా నచ్చిందని తెలుస్తోంది. నిర్మాత కూడా సెట్ అయిపోయారని, త్వరలోనే ఓ అధికారిక ప్రకటక రావొచ్చని సమాచారం.
సిద్దు ప్రస్తుతం ‘తెలుసు కదా’లో నటిస్తున్నాడు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘డీజే టిల్లు 3’ కథ కూడా రెడీ అవుతోంది. ఆమధ్య చేసిన ‘జాక్’ ఫ్లాప్ అయ్యింది. సిద్దు కామెడీ సైతం వర్కవుట్ కాలేదు. ‘తెలుసు కదా’లో కామెడీ ఉన్నా, సీరియస్ అంశాన్ని టచ్ చేస్తున్నార్ట. ప్రవీణ్ కథ కూడా కొత్త శైలిలోనే ఉంటుందని, అయితే.. హీరో క్యారెక్టరైజేషన్, చేసే ఫన్ వేరే లెవల్ లో ఉండబోతున్నాయని టాక్. అన్నీ కుదిరితే ‘తెలుసు కదా’ తరవాత ఈ కాంబోకి సంబంధించిన ఓ అధికారిక ప్రకటన రావొచ్చు. ప్రవీణ్ కమర్షియల్ గా నిరూపించుకోవాలంటే ఈ సినిమాతో హిట్ కొట్టాలి. ఇది తన చేతిలో ఉన్న గోల్డెన్ ఛాన్స్ అనుకోవొచ్చు.
