బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ కు చెందిన మజ్లిస్ పార్టీ బీహార్ ని సీమాంచల్ ప్రాంతంలో ఐదు సీట్లు గెల్చుకుంది. కాంగ్రెస్ పార్టీ గెల్చుకుంది ఆరు సీట్లే. బలంలో కాంగ్రెస్‌తో సమానంగా మారింది. చాలా పరిమిత సంఖ్యలో 29 సీట్లలో మాత్రమే పోటీ చేసిన మజ్లిస్.. రెండు శాతం ఓట్లను సాధించింది. ముస్లింలకు తానే ప్రతినిధినని ఓవైసీ తన పార్టీని దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో ముస్లింలు పట్టించుకోనప్పటికీ బీహార్ లాంటి చోట్ల మాత్రం ఆదరణ లభిస్తోంది.
సీమాంచల్ ముస్లిముల్లో బీజేపీకి పట్టు
బీహార్ మొదటి నుంచి బీజేపీలో కాంగ్రెస్ కూటమి ఓట్లను చీలుస్తోంది. 2015లో బీహార్ ఎన్నికల్లో మొదటి సారి పోటీ చేసింది. కిషన్‌గంజ్‌లో ఒక సీటు గెలిచింది. కానీ ముస్లింల ఓట్లను భారీగా చీల్చింది. మజ్లిస్ దెబ్బకు కాంగ్రెస్, ఆర్జేడీ చాలా సీట్లను కోల్పోయింది. 2020లో సీమాంచల్‌లో 5 సీట్లు గెలిచి తన బలాన్ని పెంచుకుంది. ముస్లిం ఓటును విభజించి RJD-కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా చేసిందన్న విమర్శలు ఎదుర్కొంది. బీజేపీకి మేలు చేసిందని ఆ పార్టీపై కాంగ్రెస్, ఆర్జేడీ కినుక వహించాయి.
కూటమిలో చేరుతామన్నా చేర్చుకోని తేజస్వీ
ఈ సారి బీజేపీకి చాన్సివ్వకూడదని ఓవైసీ.. బీహార్ ఇండియా కూటమిలో చేరాలని ప్రయత్నించారు. కానీ తేజస్వీ యాదవ్ మాత్రం మజ్లిస్ పార్టీని కూటమిలోకి రానిచ్చేందుకు అంగీకరించలేదు. ఫలితంగా 29సీట్లలో పోటీ చేసి.. మళ్లీ 5 సీట్లు గెలుచుకుంది . అయితే ఓట్ల శాతాన్ని రెండుకు పెంచుకోవడం.. కాంగ్రెస్ కూటమికి గట్టి దెబ్బ తగిలేలా చేసింది. ముస్లిం ఓటు విభజన వల్ల 30 కంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్ కూటమి కోల్పోయిందని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. AIMIM ఇప్పుడు బీహార్‌లో కాంగ్రెస్ కంటే ఎక్కువ ముస్లిం ఎమ్మెల్యేలను కలిగి ఉంది.
జూబ్లిహిల్స్ లో మజ్లిస్ మద్దతు పొందిన రేవంత్
మజ్లిస్ తో టై అప్ ముఖ్యమని గుర్తించి.. తెలంగాణలో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఆ పార్టీతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. వారి కి ఓ ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు. జూబ్లిహిల్స్ లో మద్దతు పొందారు. అది కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగింది. రేవంత్ కు రాజకీయ వ్యూహాలు నేర్పే.. ప్రజల్లో పట్టు లేని ఆ పార్టీ హైకమాండ్ పెద్దలు.. ఇతర చోట్ల.. మజ్లిస్ ను కలుపుకోవడంలో మాత్రం.. ఫెయిలయ్యారు.
