విశాఖపట్నంలో మల్టీనేషనల్ IT జెయింట్ కాగ్నిజెంట్ అధికారికంగా ఆపరేషన్స్ ప్రారంభించనుంది. డిసెంబర్ 12 నుంచి మధురవాడ IT జోన్లో 800 సీట్ల ప్లగ్-ఆండ్-ప్లే ఫెసిలిటీతో కార్యకలాపాలు మొదలుపెట్టనున్నారు. ఇది మెగా క్యాంపస్ పూర్తి కావడానికి ముందు తాత్కాలిక సౌకర్యంగా పనిచేస్తుంది. మెగా క్యాంపస్ మొదటి ఫేజ్ 2029 మార్చి నాటికి పూర్తి అవుతుంది. ఎనిమిది వేల మంది అక్కడ పని చేస్తారు.
విశాఖ డిజిటల్ వర్క్‌ఫోర్స్‌ను బిల్డ్ చేయడానికి బలమైన పార్ట్నర్ గా ఉంటుందని కాగ్నిజెంట్ సీఈవో ఆశాభావంతో ఉన్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పూణే వంటి 13 నగరాల్లో ఆపరేషన్స్ ఉన్న కాగ్నిజెంట్, విశాఖను తమ నెట్‌వర్క్‌లో చేర్చుకోవడంతో AI, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కెపాబిలిటీలను మరింత బలోపేతం చేస్తుంది. తాత్కాలిక ఫెసిలిటీలో 800 మంది అసోసియేట్లు పని చేస్తారు, మెగా క్యాంపస్ పూర్తి కాగానే 8,000 ఉద్యోగాలు జనరేట్ అవుతాయని కంపెనీ వర్గాలు ప్రకటించాయి.
ఇటీవల TCS రూ. 1,370 కోట్లతో 12,000 ఉద్యోగాలు సృష్టించే క్యాంపస్ కూడా ప్రారంభం కానుంది. గూగుల్ ఏఐ హబ్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారి ప్రకారం, మధురవాడ IT జోన్లో ఈ ఫెసిలిటీ త్వరగా సెటప్ అవుతుంది. మొత్తం ప్రాజెక్ట్ 100% సెల్ఫ్-ఫండెడ్‌గా ఉంటుంది, మూడు ఫేజ్‌ల్లో పూర్తి అవుతుంది.
