తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి దిశగాఉంది. ఈ సమయంలో బిల్డర్లకు ప్రభుత్వం అమలు చేస్తున్న 10 శాతం మార్ట్గేజ్ క్లాజ్ ఇబ్బంది పెడుతోంది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా చట్టం పటిష్టంగా అమలులో ఉన్నందున ఈ చట్టం అవసరం లేదని వారు భావిస్తున్నారు ఈ క్లాజ్ వల్ల ప్రాజెక్టుల వ్యయం పెరిగుతోందని ఫలితంగా అంతిమంగా కొనుగోలుదార్లకే భారంగా మారుతోందని అంటున్నారు.
తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ జ్ను రద్దు చేయాలని కోరుతున్నారు. లేకపోతే కనీసం RERA రిజిస్టర్డ్ ప్రాజెక్టులకు మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. బిల్డింగ్ లేదా లేఅవుట్ అనుమతులు జారీ చేసేటప్పుడు, మొత్తం ప్రాజెక్ట్ స్థలంలో 10% భాగాన్ని ప్రభుత్వానికి మార్టిగేజ్ చేయాలి. అనుమతి పొందిన ప్లాన్ల నుంచి డెవలపర్లు తప్పుకోకుండా నియంత్రించడానికి రూపొందించారు. బిల్డర్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఈ 10% స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది .
ఈ నిబంధనల వల్ల డెవలపర్లు 10% స్థలం కోల్పోతారు. ప్రాజెక్టులో యూనిట్ల సంఖ్య 10% తగ్గుతుంది. మార్ట్గేజ్ చేసిన స్థలంపై నిర్వహణ, పన్నుల వల్ల వ్యయం పెరుగుతోంది. ఈ భారాన్ని ఫ్లాట్ ధరల్లోకి మార్చి కస్టమర్లపై వేస్తున్నారు. ఈ క్లాజ్ తొలగిస్తే, నిర్మాణాలు పెరిగి ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల ద్వారా ఆదాయం పెరుగుతుందని అంటున్నారు.
ప్రభుత్వం దీన్ని రెవెన్యూ కాకుండా, రెగ్యులేటరీ టూల్**గా చూస్తోంది. RERAతో పాటు ఇది డబుల్ సేఫ్టీ అంటున్నారు. అయితే రెరా అనుమతి ఉన్న ప్రాజెక్టులకు ఈ నిబంధనను తప్పించేలా బిల్డర్లు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు.
