వైఎస్ఆర్సీపీ పెద్దల్లో బొత్స సత్యనారాయణ వ్యవహారశైలిపై అసంతృప్తి పెరుగుతోంది. ఆయన తీరు జగన్ ను ఇబ్బంది పెట్టేలా ఉందని ..ఉద్దేశపూర్వకంగా జగన్ కు సమస్యలు సృష్టించేందుకు బొత్స కుట్ర చేస్తున్నారని అనుమానిస్తున్నారు. శాసనమండలిలో జరుగుతున్న పరిణామాలే దీనికి నిదర్శనంగా భావిస్తున్నారు.
జీఎస్టీ తీర్మానాన్ని వ్యతిరేకించిన బొత్స
కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీఎస్టీ సంస్కరణల విషయంలో వైసీపీ స్టాండ్ చాలా క్లియర్ గా ఉంది. జగన్ రెడ్డి జీఎస్టీ సంస్కరణలపై ఆహో..ఓహో అని ట్వీట్ చేశారు. కానీ బొత్స మండలిలో జీఎస్టీ అమలు విషయంలో కేంద్రాన్ని ప్రశంసిస్తూ చేస్తున్న తీర్మానాన్ని వ్యతిరేకిస్తామని ప్రకటించారు. బీఏసీ సమావేశంలో ఈ విషయం ఆయన చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సభలో ఆయన వ్యతిరేకిస్తారని అనుకున్నారు. కానీ ఆయన వ్యతిరేకించబోతున్నారని తెలిసి.. పై నుంచి ఒత్తిడి రావడంతో.. వ్యతిరేకించలేదు. అలాగని.. సమర్థించలేదు. చివరికి బొత్స ఎక్కడ కొంప ముంచుతారో అని మండలి చైర్మన్ పాస్ అయినట్లుగా ప్రకటించారు.
జగన్ గుండెల్లో రాయి వేసిన బొత్స
జగన్ రెడ్డి పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. ఆయన బీజేపీ కాళ్లు పట్టుకుని వదిలే పరిస్థితి లేదు. వారికి ఏ చిన్న కోపం తెప్పించినా తాను జైల్లోనే ల్యాండ్ అవుతారు . తాను చేసిన నేరాలు, ఘోరాల విషయంలో ఎంతగా పట్టుకుని ఆపుతున్నారో ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అందుకే కేంద్రం వైపు నుంచి ఏం చేసినా ఆహో..ఓహో అంటున్నారు. దానికి తగ్గ ప్రయోజనాలు పొందుతున్నారు. కానీ అవన్నీ తాత్కాలికమైనవే. అవే ఆయనను బయట ఉండేలా చేస్తున్నాయి. ఇదంతా తెలిసి కూడా బొత్స జీఎస్టీ సంస్కరణలను పొగడకుండా వ్యతిరేకిస్తామని చెప్పడం.. అసలు సమర్థించకపోవడం వైసీపీ అధినేత జగన్ లో అసహనానికి కారణం అవుతోంది.
బొత్స జగన్ పై కుట్ర చేస్తున్నారా ?
బొత్స వ్యవహారం వైసీపీలో అనేక రకాల చర్చలకు కారణం అవుతోంది. ఆయన ఇటీవలి తీరు జగన్ ను అవమానించేలా ఉందని అనుకుంటున్నారు. షర్మిలతో ఆత్మీయంగా ముచ్చట్లు, రఘురామ వంటి వారితో రాసుకునిపూసుకుని తిరగడం వంటివి జగన్ కు కొత్త అనుమానాలు రేకెత్తించేలా ఉన్నాయి. మండలిలో ఆయన తీరు కూడా జగన్ కు నచ్చడం లేదు. శాసనమండలి చేతుల్లో ఉన్నా ప్రభుత్వాన్ని కనీసం ఇబ్బంది పెట్టలేకపోతున్నారని ఆయన అనుకుంటున్నారు. త్వరలో బొత్సకు .. జగన్ రెడ్డి తానేంటో చూపించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
