బొత్స సత్యనారాయణ వైసీపీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేలు సభకు రావడం లేదు. సభలో ఆయనకు ప్రతిపక్ష నేత గుర్తింపుతో ప్రోటోకాల్ ఉంది. అయితే ఆయన మండలిలో ప్రభుత్వాన్ని విమర్శించే విషయంలో తనదైన లాంగ్వేజ్ ప్రయోగిస్తున్నారు. అది ఎవరికీ అర్థం కావడడం లేదు. స్వయంగా మండలి చైర్మన్ కూడా.. అర్థం కావడం లేదని.. చెబుతున్నారు. తాాజాగా ఆయన కార్మిక చట్టాల మార్పు చేస్తూ తీసుకొచ్చిన బిల్లుపై విచిత్రంగా మాట్లాడారు.
కార్మికుల హక్కులను ఒక్క కలం పోటుతో తీసేశారని..ఇక రోజుకు పన్నెండు గంటలు పని చేయాలా అని స్పందించారు. ఆయన తీరుతో వైసీపీ సభ్యులు కూడా ..తలలు పట్టుకోవాల్సి వచ్చింది. అసలు చట్టం గురించి ఏమీ తెలియకుండా..ఏదేదో మాట్లాడటం ఏమిటని వారిలోనే వారు గుసగుసలాడుకున్నారు. కార్మిక చట్టాల్లో మార్పులు చేశారు. ఇక రోజుకు కార్మికులు పది గంటల వరకూ పని చేసుకోవచ్చు. కానీ వారానికి 48గంటల కన్నా ఎక్కువ పని చేయించుకుంటే ఓవర్ టైమ్ డ్యూటీ డబ్బులు ఇవ్వాలి. గతంలోనూ వారానికి 48 గంటల పనే.
కేవలం ఉద్యోగులు, కార్మికుల్లో వెసులబాటుకు, పరిశ్రమలు నిరంతరం పని చేయడానికి తీసుకు వచ్చిన మార్పులు ఇవి. దేశంలోని అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి. ఇవి ఎక్కడా కార్మికుల పని గంటలు పెరిగాయని ఎవరూ చెప్పడం లేదు. ఈ మార్పులు కార్మికులకు అనుకూలంగా ఉంటాయని ఎక్కువ మంది భావిస్తున్నారు. అయినా బొత్స మాత్రం.. తనకు అర్థమైనట్లుగా పన్నెండు గంటలు పని చేయాలా అని.. మాట్లాడేసి.. తన స్పీచ్ అయిపోయిందనిపించుకున్నారు.
