పరకామణి చోరీ కేసులో భూమన కరుణాకర్ రెడ్డి భుజాలు తడుముకున్నట్లుగా మాట్లాడుతున్నారు. పత్రికలు ఏవో రాశాయని వాటిపై కేకలేస్తున్నారు. కానీ సీఐడీ విచారణకు వెళ్లి వచ్చి వాళ్లు అడిగిన సమాచారం ఏమీ చెప్పలేదని తనకు మాత్రమే తెలిసిన పాస్టర్ స్టైల్ మేనరిజంతో మీడియా ముందు సైటైర్లు వేశానని అనుకున్నారు. కానీ ఆయన కంగారు పడుతున్నారని చూసేవాళ్లకు సులువుగానే అర్థమైపోతుంది.
నిన్నతిరుపతిలో పడిన వానలో ఎన్ని చినునుకులు ఉంటాయి.. ఎంత మంది తలనీలాలు ఇచ్చారో లాంటి ప్రశ్నలు అడిగారని అవన్ని తనకు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ఇక్కడే భూమన కరుణాకర్ రెడ్డి తను సీఐడీ అధికారులు అడిగిందేమీ చెప్పలేదని స్వయంగా ఒప్పుకున్నట్లయింది. సీఐడీ అధికారులు అడగాల్సిందే అడుగుతారు.. దానికి భూమన సమాధానం చెప్పాలి. అలా కాకుండా.. నాకు తెలియదని చెప్పి వస్తే.. వారి దగ్గర ఉన్న ఆధారాలతో వారు చేయాల్సింది చేస్తారు.
పరకామణి కేసుకు తనకూ.. చాలా దూరం ఉందని కరుణాకర్ రెడ్డి చెబుతున్నారు. అది చెప్పాల్సింది సీఐడీ అధికారులు. ఫిర్యాదుదారు సతీష్ చనిపోయినప్పుడు అందరి కంటే ముందు వచ్చి ఆత్మహత్య అని ఎందుకు నెరేటివ్ సృష్టించాలనుకున్నాడో ఆయనకు బాగా తెలుసు. సీఐడీ అధికారులకు తెలియకుండా ఉంటుందా?
