టెన్త్, ఇంటర్ ఏజ్ గ్రూప్ కథలు తెరపైకి తీసుకురావడం అంత ఈజీ కాదు. ఆ వయసుల్లో ఫీలింగ్స్ బిగ్ స్క్రీన్ పై క్రింజ్ అనిపించే ప్రమాదమే ఎక్కువ. ఏ మాత్రం తేడాకొట్టిన నిబ్బా నిబ్బి అనే ముద్ర పడిపోతుంది. అయితే ఈ సినిమాలు యూత్ కనెక్ట్ చేసేలా తీస్తే మాత్రం రిజల్ట్ వేరే లెవల్ లో ఉంటుంది. నిజానికి థియేటర్స్ లో సినిమా చూసే ఆడియన్స్ లో వాళ్ల పర్సెంటే ఎక్కువ. లేటెస్ట్ గా వచ్చిన లిటిల్ హార్ట్స్ ఈ జానర్ లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది. క్రింజ్ ఫీలింగ్ లేకుండా చిన్న చిన్న సరదాలతో నడిపిన సినిమా బాక్సాఫీసు వద్ద మంచి ఫలితం చూసింది.
ఇప్పుడు దర్శకుడు మారుతి టీం నుంచి ఇలాంటి ఏజ్ గ్రూప్ సినిమా వస్తోంది, అదే బ్యూటీ. అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటించారు. తాజాగా ట్రైలర్ వదిలారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా ఇది. ఓ ప్రేమజంట తీసుకున్న నిర్ణయం ఎలాంటి మలుపులు తీసుకుందనేది కథ. అటో వెనుక ఉన్న కొటేషన్ లాంటి డైలాగ్ తో మొదలైన ట్రైలర్.. మధ్యలోకి వచ్చేసరి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా మారింది. పిల్లలతో పాటు పేరెంట్స్ ఎమోషన్ కూడా కీలకం. నరేష్, వాసుకీ పాత్రలు కీలకంగా కనిపించాయి. ఓ చిన్న లవ్ స్టోరీగా మొదలైనప్పటికీ ఫైనల్ గా మేటర్ సీరియస్ గా మారిపోయింది. సినిమాను సెప్టెంబర్ 19న రిలీజ్ చేస్తున్నారు. ఇలాంటి సినిమాలకు యూత్ ఆడియన్స్ ఇంధనం. వాళ్లకు కనెక్ట్ అయితే సినిమా నిలబడిపోయినట్లే.
