ఎవరూ ఊహించని ఆరోపణలు, వ్యాఖ్యలు చేయడమే కేంద్రమంత్రి బండి సంజయ్ స్పషాలిటి, తాజాగా ఆయన ప్రెస్మీట్ పెట్టి గోపీనాథ్ ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య గొడవలు ఉన్నాయని ప్రకటించారు. గోపీనాథ్ ఆస్తులను రేవంత్ రెడ్డి, కేటీఆర్ పంచుకునేందుకు కుట్రలు చేశారని.. ఆస్తి పంపకాల్లో ఇద్దరి మధ్య తేడాలు వచ్చాయని బీజేపీ ఆఫీసులో ప్రెస్మీట్ పెట్టి ఆరోపించారు.
గోపీనాథ్ మరణం వెనుక మిస్టరీ ఉందని ఆయన తల్లే చెబుతోంది..అయినా విచారణ జరపకపోవడానికి కారణం ఇదేనన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులు, ఆసుపత్రి యాజమాన్యం స్టేట్ మెంట్లను రికార్డు చేయాలి. తన తండ్రిని చూడటానికి రావొద్దంటూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి పువ్వాడ అజయ్ బెదిరించినట్లు గోపీనాథ్ కొడుకే ఆరోపించారని బండి సంజయ్ గుర్తు చేశారు. అయినా సీఎం రేవంత్ రెడ్డి గుండె మాత్రం కరగడం లేదు… స్పందించడం లేదన్నారు.
గోపీనాథ్ ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి ట్విట్టర్ టిల్లు మధ్య పంపకాల యవ్వారం ఉంది. అందుకే కేసీఆర్ కుటుంబంపై ఉన్న కేసులపై విచారణ జరగడం లేదు… అరెస్టు చేయడం లేదు. గోపీనాథ్ ఆస్తిపాస్తుల పంపకాల్లో కేటీఆర్, రేవంత్ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. వీటికోసమే వీరిద్దరి మధ్య పగలు, పట్టింపులు ఎక్కువయ్యాయి. గోపీనాథ్ చనిపోయాక ఆయన ఆస్తులను వీళ్లద్దరూ పంచుకున్నారని ఆరోపించారు. దమ్ముంటే గోపీనాథ్ ఆస్తులెన్ని? అవన్నీ ఎటుపోయాయో చెప్పాలన్నారు.
గోపీనాథ్ మరణం వెనుక ఏం జరిగిందో.. ఆయన ఎప్పుడు చనిపోయారు? ఎవరికి ఆలస్యంగా చనిపోయినట్లు ఆసుపత్రి యాజమాన్యం ప్రకటన చేసిందో విచారణ జరపాల్సిందేనని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులు కొట్లాడుకోవడం చూశాం. ఇక్కడ మాత్రం గోపీనాథ్ ఆస్తులపై సీఎం రేవంత్, ట్విట్టర్ టిల్లు కొట్లాడుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని బండి సంజయ్ ఆశ్చర్యపోయారు.
