జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో నవీన్ యాదవ్ కు మజ్లిస్ పార్టీ బహిరంగంగా మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ .. నామినేషన్ తర్వాత మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీని కలిశారు. మద్దతు ఇవ్వాలని కోరారు. దానికి అసదుద్దీన్ ఓవైసీ సానుకూలంగా స్పందించారు. గత పదేళ్లుగా తెలంగాణ పరిస్థితి అస్తవ్యస్థంగా ఉందనన్నారు. నవీన్ యాదవ్ గెలిచి .. జూబ్లిహిల్స్ ను అభివృద్ధి చేయాలన్నారు.
నవీన్ యాదవ్ గతంలో మజ్లిస్ సేత. 2014లో మజ్లిస్ తరపున జూబ్లిహిల్స్ లో పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. కానీ మజ్లిస్ తర్వాత బీఆర్ఎస్ పార్టీతో అప్రకటిత టై అప్ కారణంగా.. జూబ్లిహిల్స్ పోటీ చేయడం మానుకుంది. దీంతో ఓ సారి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన నవీన్ యాదవ్.. మూడో స్థానంలో నిలిచారు. తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోయినా.. అనూహ్యంగా వచ్చిన ఉపెన్నికలతో ఆయనకు అవకాశం దక్కింది.
జూబ్లిహిల్స్ లో మజ్లిస్ ఓటర్లు కీలకమని భావిస్తున్నారు. దాదాపుగా లక్ష వరకూ ముస్లిం ఓటర్లు ఉంటారు. సంప్రదాయంగా వారు కాంగ్రెస్ కు మద్దతిస్తారు.ాకనీ మజ్లిస్ పోటీలో ఉంటే మాత్రం ఆ పార్టీకే ఓటు వేస్తారు. ఈ సారి కాంగ్రెస్ కు నేరుగా మజ్లిస్ మద్దతు ప్రకటించడం వల్ల .. నవీన్ యాదవ్ కు అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని భావిస్తున్నారు. గతంలో భారత రాష్ట్ర సమితి విజయాలకు మజ్లిస్ మద్దతు కీలకం. ఈ సారి ఆ పార్టీ మద్దతు కాంగ్రెస్ పార్టీకి లభిస్తోంది.
