ఏపీలో ఓ ముఠా కల్తీ మద్యం తయారు చేస్తున్న విషయం వెలుగులోకి రాగానే నిందితుల్ని అరెస్టు చేశారు. విదేశాల నుంచి రప్పించి మరీ అదుపులోకి తీసుకున్నారు. మొత్తం తీగ లాగుతున్నారు. ఐజీ స్థాయి అధికారితో సిట్ వేశారు. అదే సమయంలో రాష్ట్రంలో ఎక్కడైనా కల్తీ మద్యం అమ్ముతున్నట్లుగా కనిపిస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. క్యూఆర్ కోడ్ ప్రతి బాటిల్ పై ఉండేలా చర్యలు తీసుకున్నారు. యాప్ కూడా రిలీజ్ చేశారు. ఈ వేగం ప్రభుత్వం పై నమ్మకాన్ని పెంచుతోంది.
ఈ దందాలో టీడీపీ నేతలో.. ఈ దందాను కొనసాగించడానికి టీడీపీలో చేరిన వారో ఉన్నారు. వారిని కూడా వదిలి పెట్టలేదు. అరెస్టులు చేయిస్తున్నారు. టీడీపీ నేతలు అనే ట్యాగ్ పెట్టుకుని తప్పుడు పనులు చేస్తే రక్షణ దొరుకుతుందని అనుకోవద్దని గట్టి సందేశం పంపించారు. అదే సమయంలో వైసీపీ హయాంలో ఏం జరిగిందా అని ఆలోచిస్తే.. ఒక్కటంటే ఒక్కదానిపైనా ఎప్పుడూ విచారణలు జరిగిందే లేదు. తాడేపల్లిగూడంలో ఇరవై మందికిపైగా కల్తీ మద్యం కారణంగా చనిపోయారు. కానీ విచారణ అనే మాట లేదు.
లిక్కర్ దుకాణాలకు సరఫరా అవుతున్న మద్యం అంతా విషపూరితమేనని ఆరోపణలు వచ్చాయి. కానీ ఒక్క రోజు విచారణ చేయించలేదు. ఒక్క మద్యం విషయంలోనే కాదు .. ఎన్నో అరాచకాలు చేశారు. చంద్రబాబుపై హత్యాయత్నాలు, టీడీపీ కార్యాలయాలపై దాడులు, పట్టాభి ఇంటిపై దాడులు ఇలా లెక్కలేనన్ని జరిగాయి. కానీ ఏ ఒక్క అంశంలోనూ నిజాయితీగా విచారణ చేయించలేదు. వైసీపీ నేతలు చేసిన స్కాములు లెక్కలేనన్ని వెలుగులోకివచ్చాయి. వాటిని ఎప్పటికప్పుడు సమర్థించుకున్నారు కానీ.. నిజాలు బయటపెట్టలేదు.
పాలన అంటే దోపిడీ అన్నట్లుగా చేశారు. దొరికిపోయినా విచారణల్లేకుండా చేసుకున్నారు. ఇప్పుడు సొంత పార్టీ నేతల్ని కూడా చూడకుండా.. టీడీపీ ప్రభుత్వం నకిలీ మద్యం వ్యాపారం చేసే వారిని కటకటాల వెనక్కి పంపింది. కఠిన చర్యలు తీసుకుబోతోంది. అయినా వైసీపీ నేతలు తాము ఏం చేశామో తెలియకుండా.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను విమర్శిస్తున్నారు. జగన్ హయాంలో జరిగిన విచారణలు ఏమింటటే…. చంద్రబాబును, ఇతర టీడీపీ నేతల్ని తప్పుడు కేసుల్లో ఇరికించడానికి చేసిన విచారణలే. జగన్ హయాంలో ఎప్పుడైనా “విచారణ”లు జరిగాయా?
