ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఆర్థిక, వాణిజ్య కేంద్రంగా మార్చే దిశగా కీలక ఘట్టం జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 28వ తేదీన అమరావతికి చెందిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ సహా 25 జాతీయ, ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల నూతన భవనాలకు శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమం CRDA ప్రధాన కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన సభా వేదికపై జరుగనుంది. అన్ని బ్యాంకులకు ఒకేసారి శంకుస్థాపనచేస్తారు. CRDA ప్రధాన కార్యాలయం వద్ద సభా వేదిక ఏర్పాటు చేశారు.
అక్టోబర్ 2025లో RBI రీజియనల్ ఆఫీస్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. మొత్తంగా 49.5 ఎకరాలు 11 సంస్థలకు, 12.66 ఎకరాలు బ్యాంకులు, ప్రభుత్వ సంస్థల అధికారుల నివాసాలకు కేటాయించారు. ఇటీవలి CRDA సమావేశాల్లో NABARD, SBI, UBI, Bank of Baroda, Bank of India, Canara Bank, Indian Bank, Coastal Local Area Bank వంటి బ్యాంకులకు భూములు ఆమోదించారు.
శంకుస్థాపన అమరావతిని అంతర్జాతీయ స్థాయి ఆర్థిక కేంద్రంగా మార్చడానికి కీలకం. బ్యాంకుల ఏర్పాటుతో ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. RBI రీజియనల్ ఆఫీస్ ఏర్పాటు జాతీయ సంస్థల విశ్వాసాన్ని తెలియజేస్తోంది. శంకుస్థాపన గత నెలలోనే జరగాల్సి ఉన్నా.. తుపాను కారణంగా వాయిదా పడింది.
