లిక్కర్ స్కాంలో ఏ 4 నిందితుడు మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే ఆయన పాత్రపై చార్జిషీటు దాఖలు చేయడం, రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకుని ప్రశ్నించడంతో ఆయనకు బెయిల్ లభించినట్లుగా తెలుస్తోంది. రూ. 2 లక్షలతో రెండు ష్యూరిటీలు ఇవ్వాలని కోర్టు ఆదేసించింది. వారంలో రెండుసార్లు సంతకాలు చేయాలని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు వరకూ ప్రయత్నించి ముందస్తు బెయిల్ తెచ్చుకోవడంలో విఫలం కావడంతో మిథున్ రెడ్డి జూలైలో అరెస్ట్ అయ్యారు. 71 రోజులుగా రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం మధ్యలో నాలుగు రోజులు మథ్యంతర బెయిల్ పై బయటకు వచ్చి మళ్లీ జైల్లో సరెండర్ అయ్యారు. రేపు జైలు నుంచి మిథున్ రెడ్డి విడుదలయ్యే అవకాశం ఉంది. దసరా పండగ ముందు బెయిల్ రావడంతో ఆయన పండుగ చేసుకోనున్నారు.
లిక్కర్ స్కాం పాలసీ మార్పు నుంచి బ్రాండ్లు, లంచాలు వసూలు చేయడం వరకూ మొత్తం మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగింది. ప్రత్యక్షంగా ఏ 1 కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వ్యవహారాలు చక్కబెడితే.. నెలకు అరవై కోట్ల వరకూ ఆయన నుంచి డబ్బులు తీసుకుని తన కమిషన్ తాను మినహాయించుకుని మిగతాది జగన్ చేరేలాచేసేవారని మిథున్ రెడ్డి గురించి సిట్ తేల్చింది.
