యువ హీరోలు పంథా మార్చారు. ఫలానా పాత్రలనే చేయాలి అని పట్టుపట్టుకొని కూర్చోవడం లేదు. ఎలాంటి పాత్రకైనా రెడీ అంటున్నారు. తాజాగా తనీష్ విలన్‌గా కనిపించబోతున్నాడు. అదీ.. కృష్ణవంశీ సినిమాలో. కృష్ణవంశీ దర్శకత్వంలో నక్షత్రం అనే సినిమా తెరకెక్కుతోంది. సందీప్ కిషన్ కథానాయకుడు. ఈ చిత్రంలో తనీష్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ ఓ అతిథి పాత్ర చేయడానికి రెడీ అయ్యాడు. అంటే ఈ సినిమాలో ముగ్గురు హీరోలున్నారన్నమాట. కాజల్ కూడా అతిథి పాత్రలో కనిపించనుందని చెప్పుకొంటున్నారు. వీళ్లతో పాటు రెజీనా కూడా ఉంది. అలా ఈ నక్షత్రం పేరుకు తగ్గట్టు స్టార్స్‌తో నింపేయబోతున్నాడు కృష్ణవంశీ.
బాలనటుడిగా పరిచయమైన తనీష్.. నచ్చావులే సినిమాతో హీరో అయ్యాడు. రైడ్ కూడా బాగానే ఆడింది. అయితే ఆ తరవాత తనీష్‌కి హిట్లు లేవు. ఇప్పుడు అవకాశాలూ రావడం లేదు. ఈమధ్యే తనీష్ తండ్రి ఆత్మహత్య చేసుకొన్నారు. ఆ బాధలో ఉన్న తనీష్ కి కృష్ణవంశీ నుంచి పిలుపు రావడం, అదీ విలన్ పాత్ర కావడం.. విశేషంగా చెప్పుకోవొచ్చు. మరి విలన్‌గా తనీష్ ఎలా మెప్పిస్తాడో చూడాలి.
