మహేష్ బాబు పీవీపీ సంస్థలో మరో సినిమా చేయబోతున్నాడన్నట్టు కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. మొన్న మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా విశేషాల్ని పీవీపీ కూడా స్వయంగా ప్రకటించింది. ప్రొడక్షన్ నెం.8 అంటూ పెద్ద పెద్ద యాడ్లు వేసింది కూడా. అయితే… ఈ విషయమై పీవీపీకి మహేష్వార్నింగ్ ఇచ్చాడట. ”నన్ను అడక్కుండా యాడ్లుఎలా వేస్తారు?” అని సీరియస్ అయ్యాడని టాక్. మహేష్ కీ పీవీపీతో ఓ సినిమా చేయాలని వుంది. అయితే.. డేట్లు అడ్జస్ట్ అవ్వడం లేదట. దానికి తోడు ఓకే చేసిన కథలే చాలా వరకూ పెండింగ్‌లో ఉండిపోయాయి. అలాంప్పుడు పీవీపీ సినిమా కూడా లైన్లో ఉందంటే మిగిలిన దర్శకులకు, నిర్మాతలకు కొత్త టెన్షన్ పట్టుకొంటుంది.
అందుకే… మహేష్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకొన్నాడని తెలుస్తోంది. ”నేను చెప్పేంత వరకూ మీకు మీరే ఎనౌన్స్ చేసుకోకండి..” అని క్లియర్ కట్‌గా చెప్పాడట. దాంతో అటు పీవీపీ, ఇటు దర్శకుడు వంశీ పైడిపల్లి కన్ఫ్యూజన్లో పడ్డారు. మహేష్ తమతో సినిమా చేస్తాడా, లేదా.. చేస్తే ఎప్పుడు?? అనే అందోళన నెలకొంది. వంశీ పైడిపల్లి కూడా మహేష్ పై ఆశలు పెట్టుకొని ఇంకో హీరో కోసం కూడా ట్రై చేయలేదు. ఎందుకైనా మంచిది వంశీ మరో ఆప్షన్ చూసుకొంటే బెటరేమో..??
