టీటీడీ నెయ్యి కల్తీ స్కాం లో అరెస్ట్ అయిన చిన్న అన్నప్పుడు ఎంపీ వేమిరెడ్డి దగ్గర పని చేసేవారని జగన్ రెడ్డి ప్రెస్మీట్ లో ప్రకటించారు. వైసీపీ హయాంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి టీటీడీ బోర్డు సభ్యురాలిగా ఉన్నారు. దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చిన్న అప్పన్న అనే వ్యక్తిని తన వద్దకు పంపించి సాయం చేయాలని విజ్ఞప్తి చేశారని అందుకే రూ. 50వేలు ఇచ్చానని అన్నారు. కుటుంబానికి జరుగుబాటు లేదని తన సాయం కోసం వచ్చిన కొన్ని వందల మందికి తాను సాయం చేశానన్నారు.
ఇప్పుడు ఆ సాయాన్ని అడ్డం పెట్టుకుని తనపై నిందలు వేయడాన్ని వేమిరెడ్డి .. ఇదేం మనస్థత్వం అనిప్రశ్నిస్తున్నారు. సహాయం చేసి కూడా బండలు మోయాల్సి వస్తోంది.జగన్ మాటలు బాధ పెట్టాయని అందుకే స్పష్టత ఇస్తున్నానని అన్నారు. అప్పన్న అనే వ్యక్తి కుటుంబానికి జరుగుబాటు లేకపోవడంతోనే తాను సేవా భావంతో రూ.50 వేలు చెక్కు ఇచ్చానని .. అతన్ని ఎవరు పంపించారో కూడా వారికి తెలుసని అన్నారు.
అప్పన్న అనే వ్యక్తి జగన్ హయాంలో ఐదు సంవతర్సాల పాటు సలహాదారుగా ఉన్నారు. ఆ జీవోలు ఉన్నాయి. ఆయన డబ్బులు డ్రా చేసుకున్నారు. అంటే .. ఏ పాపం తెలియని .. నిరుపేద యువకుడ్ని ట్రాప్ లోకి లాగి.. అతన్ని బకరాలాగా వాడుకున్నారు. ఇప్పుడు అంతా బయటపడేసరికి.. అతన్ని జైలు పాలు చేసి.. అతనెవరో మాకు తెలియదని .. అంటున్నారు.