నెల్లూరు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టే ముందు రోజు కోర్టులో చోరీ జరిగింది. ఆయనకు సంబంధించిన కీలక కేసు ఫైల్స్ దొంగతనం జరిగింది.దానిపై సీబీఐ విచారణ జరిగింది. ఇప్పుడు ఆయన కేసులకు సంబంధించిన మరిన్ని ఫైల్స్ మాయమయినట్లుగా గుర్తించారు.
ఎన్నికల్లో పంచడానికి 2014లో నకిలీ మద్యాన్ని వైసీపీ నేతలు డంప్ చేశారు. వాటిని పట్టుకున్నారు. ఆ కేసులు కోర్టుల్లో ఉన్నాయి. కేసుల్లో డాక్యుమెంట్లు పరిశీలన జరిగే సమయానికి పత్రాలు మాయమయ్యాయి. పత్రాలన్నీ ఉంటేనే ప్రత్యేక కోర్టులో కేసుల విచారణ ప్రారంభమవుతుంది. విచారణ ముందుకెళ్లకుండా ఉండేందుకే పత్రాలను మాయం చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. కాకాణి అత్త ఊరు వావిలేటిపాడులో భూఆక్రమణ కేసు ఫైలు కూడడా మాయమైందిని.. కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో మళ్లీ తెచ్చి పెట్టారని తెలుస్తోంది.
ఓ సారి సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు విదేశాల్లో ఆస్తులున్నాయని ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఆరోపణలు చేశారు. తర్వాత ఆ రాకెట్ ను పోలీసులు పట్టుకున్నారు. ఆ కేసులో కాకాణి చాలా రోజులు అజ్ఞాతంలో ఉండి బయటకు వచ్చాడు. విచారణ కూడా పూర్తయింది. కుట్ర పూరితంగా ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేశారని తేలింది. విచారణ జరగాల్సినా సమయానికి డాక్యుమెంట్లు మాయం అయ్యాయి. ఇలా నెల్లూరు కోర్టులో అన్నీ కాకాణికి సంబంధించిన కేసుల డాక్యుమెంట్లే ఎందుకు మాయమవుతున్నాయన్నది అందిరికీ తెలిసిన మిస్టరీగా మారింది.