అమరావతి భూసమీకరణ విషయంలో ఎలా విమర్శలు చేయాలో తెలియక.. వైసీపీ బ్యాచ్.. టీడీపీ నేత వడ్డే అంటూ… వడ్డే శోభనాద్రీశ్వరరావును తెరపైకి తీసుకు వచ్చి మాట్లాడిస్తున్నారు. ఆయన రాజకీయాలకు దూరం అయి రెండు దశాబ్దాలు దాటింది. వయసు మీద పడింది. బయట ఏం జరుగుతుందో తెలియడం లేదు.కానీ ఆయనకు ఏం చెప్పి తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారో కానీ.. మాట్లాడించి సాక్షి మీడియాలో.. వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేయిస్తున్నారు. ఇదే మొదటి సారి కాదు. ఆయనతో చాలా కాలంగా సాక్షికి… వైసీపీకి ఈ అనుబంధం కొనసాగుతోంది.
అమరావతిలో కట్టాలనుకుంటున్న రైల్వేస్టేషన్ గురించి శోభనాద్రీశ్వరావు మాట్లాడారు. అక్కడ 29 గ్రామాలల్లో రెండు లక్షల మంది కూడా ఉండరని.. వారికి అంత పెద్ద రైల్వే స్టేషన్ ఎందుకని మాట్లాడారు. అన్నీ అంతే. ఆయన దశాబ్దాలుగా రాజకీయం చేసిన నేత. ఇంత చిన్న విషయం ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు. తెలియదని అనుకోలేం. అక్కడ రైల్వే స్టేషన్ కడుతోంది.. కేవలం 29 గ్రామాల ప్రజలకు కాదు. ప్రభుత్వం ఓ విద్య, ఉపాధి నగరంగా అమరావతిని మారుస్తోంది. రాబోయే రోజుల్లో లక్షల మంది వస్తారు. ఆ అవసరాలకు తగ్గట్లుగానే నిర్మిస్తోంది. ఇది అందరికీ తెలుసు. కానీ వడ్డేగారు మాత్రం.. తన కు అందిన స్క్రిప్ట్ ప్రకారం తాను చదివారు.
అమరావతి రైతుల గురించి టీడీపీ నేత మాట్లాడారు అని చెప్పడానికి.. ప్రతి పదం ముందు .. ప్రతీ సారి టీడీపీ నేత శోభనాద్రీశ్వరరావు అని పెడితే వెయిటేజీ వస్తుందని సజ్జల లాంటి వాళ్ల ప్రత్యేక వ్యూహం. కానీ ఆయన టీడీపీలో ఎప్పుడున్నారు.. రెండు దశాబ్దాల కిందట ఉన్నారు. మళ్లీ లేరు. ఆయన రాజకీయాల్లోనే లేరు.
అమరావతి భూసమీకరణ గురించి తప్పుడు ప్రచారం చేయడానికి ఇప్పుడు వైసీపీకి నాయకులు కావాలి. ఎవరూ దొరకడం లేదు. అందుకే ..లేచి నిలబడలేని పరిస్థితుల్లో ఉన్న శోభనాద్రీశ్వరరావును ఇబ్బంది పెడుతున్నారు .
వైసీపీ ఇంకా కొత్తగా ఆలోచించాల్సి ఉంది. రాజధాని గ్రామాల్లోకి భూములు ఇవ్వొద్దని రైతుల్ని మోటివేట్ చేయాలి. తాము వస్తే మళ్లీ నాశనం చేస్తామని చెప్పి భయపెట్టాలి. అప్పుడే భూసమీకరణకు ఆటంకాలు ఏర్పడతాయి. అంతే కానీ ఇలా రిటైరైపోయిన రైతు నేతలుగా పేరు తెచ్చుకున్న వారిని తెచ్చి మాట్లాడితే.. వైసీపీ ఎప్పుడూ చేసే కుట్రల్లో భాగం అనే అనుకుంటారు. గ్రో అప్.. అమరావతి హేటర్స్.. !
