జగన్ హఠాత్తుగా లండన్ నుంచి వచ్చేశారు. పదిహేను రోజుల పాటు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. పదకొండో తేదీన బెంగళూరు నుంచి బయలుదేరి వెళ్లారు. 19వ తేదీన దిగిపోయారు. అంత వేగంగా ఎందుకు వచ్చేశారు?. ఆయన అలా రావడం వల్ల.. వైసీపీ సోషల్ మీడియాకు ఎలా ఎలివేషన్లు వేసుకోవాలో తెలియక..ఆయన డెనిమ్ షర్టు వేసుకొచ్చారని పొగిడేస్తున్నారు. బట్టలేసుకుంటే కూడా పొగడాలా అని ఇతర పార్టీల నేతలు ఆశ్చర్యపోతున్నారు. కానీ అసలు ఎందుకు ముందుకు రావాల్సి వచ్చిందో చర్చించకుండా వీరు ఇలా వింత పోస్టులు పెడుతున్నారన్న డౌట్స్ వస్తున్నాయి.
జగన్ కు ఎలివేషన్లు ఇవ్వడానికి ఏమీ దరొకట్లేదు !
వైసీపీ సోషల్ మీడియాలో జీతాలు తీసుకుంటున్నారు. ఫేక్లు, అవాస్తవాలు, పిచ్చి ఎడిట్లు పోస్టులు చేసుకుంటున్నారు. కానీ వారిలో అసంతృప్తి ఉంది. అదంతా ఎదుటి వాళ్ల ప్రచారానికే కానీ.. జగన్ రెడ్డికి ఓ ఎలివేషన్ ఇద్దామంటే సరైన అవకాశం లభించడం లేదు. ఎప్పుడైనా వచ్చి ఆయన చేతులెత్తి దండం పెట్టే ఫోటోలు వస్తే.. వాటిని పోస్టు చేసి… ఆట్..హీరో.. మాటలు పెట్టి ఎలివేషన్లు వేయడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. వారు కరువు ఎలా ఉందంటే.. జగన్ రెడ్డి ఓ డెనిమ్ షర్ట్ వేసుకుని చింపిరి గడ్డంతో లండన్ నుంచి తిరిగి వస్తే దాన్ని కూడా.. పొగుడుతూ పోస్టులు పెట్టుకుంటున్నారు. దీపావళి పండుగ చేసుకుని నాలుగు ఫోటోలు విడుదల చేస్తే అదే మహా ప్రసాదం అనుకుంటున్నారు.
అనుమతి తీసుకున్నన్ని రోజులూ లండన్లో ఉండలేకపోయిన జగన్
వైసీపీ సోషల్ మీడియా భావదారిద్ర్యానికి ఇంత కన్నా గొప్ప ఉదాహరణ ఉండదన్నట్లుగా.. జగన్ లండన్ నుంచి రాక సందర్భంగా చేసిన హడావుడి కనిపిస్తోంది. కోర్టు అనుమతి తీసుకుని లండన్ వెళ్లారు జగన్. పదిహేను రోజుల పాటు కోర్టు గడువు ఇచ్చింది. కానీ అన్ని రోజుల పాటు ఆయన లండన్ లో ఉండలేకపోయారు. మామూలుగా అయితే 23వ తేదీన తిరిగి వస్తారని చెప్పుకున్నారు. కానీ 19నే తిరిగి వచ్చారు. పది రోజులు కూడా లండన్ లో ఉండలేకపోయారు. దానికి కారణం ఏమిటో తెలియదు కానీ ఆయనొస్తున్నట్లుగా అబ్బయ్యచౌదరి ద్వారా సోషల్ మీడియాకు సమాచారం ఇచ్చుకున్నారు.
ఫోన్ నెంబర్ ఇష్యూతోనే తిరిగి వచ్చేసినట్లుగా అనుమానం
కోర్టుకు ఫోన్ నెంబర్ తప్పుగా ఇచ్చి వెళ్లారు జగన్. ఆయన ఎక్కడికి వెళ్లారో సీబీఐ అధికారులు టచ్ కోల్పోయారు. ఇది వారికి అనుమానాస్పదంగా అనిపించింది. అందుకే వెంటనే వారు కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరగాల్సి ఉంది. దీపావళి సెలవుల తర్వాత మంగళవారం కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. షరతుల ఉల్లంఘన అని నిర్దారిస్తే బెయిల్ రద్దు చేయడానికి..మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లడానికి అనుమతులు ఇవ్వరు. అందుకే జగన్ హడావుడిగా లండన్ నుంచి వచ్చేశారని..ఇప్పుడు ఆయన వచ్చేశారని వాదించుకోవడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కానీ ఈ విషయం బయటకు రాకుండా ఉండటానికి వారు పడే తంటాలు అన్నీ ఇన్నీ కావు.
